టేక్మల్ మెదక్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము మెదక్ రెవెన్యూ డివిజన్, ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ప్రముఖ నిజాం విమోచన ఉద్యమకారుడు నూతి శంకరరావు, జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన బాలయ్య ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలమునకు ఈశాన్యాన పాపన్నపేట, తూర్పున పాపన్నపేట మరియు కుల్చారం మండలాలు, పశ్చిమాన శంకరంపేట-ఏ మరియు అల్లాదుర్గ్ మండలాలు దక్షిణాన సంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా కలవు. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 34523. ఇందులో మహిళలు 17212, మహిళలు 17311. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 37775. ఇందులో పురుషులు 18586, మహిళలు 19189. అక్షరాస్యుల సంఖ్య 16280. అక్షరాస్యత శాతం 49.34%. రాజకీయాలు: ఈ మండలము ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఈ మండలానికి చెందిన బాలయ్య జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Achannapally, Bardipur, Bodagat, Bodmatpally, Dadaipally, Dhanoora, Eklaspur, Hasanmohmadpally, Kadloor, Korampally, Kusangi, Malkapur, Palvancha, Shabad, Tamploor, Tekmal, Yelkurthi, Yellampally, Yellupet, Yelupugonda
ప్రముఖ గ్రామాలు
టేక్మల్ (Tekmal):ఆర్యసమాజ్ నాయకుడు, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు అయిన నూతి శంకరరావు ఈ గ్రామానికి చెందినవారు. వెల్పుగొండ (Velpugonda): మండల కేంద్రానికి ఇది 15 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ శ్రీతుంబేశ్వర దేవాలయం ఉంది. ఇది చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆలయం. 13వ శతాబ్దిలో కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించే సమయంలో వారే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా శాసనాల ఆధారంగా తెలుస్తుంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Tekmal Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి