5, ఏప్రిల్ 2019, శుక్రవారం

తూఫ్రాన్ మండలం (Tupran Mandal)

 తూఫ్రాన్ మండలం
జిల్లా మెదక్
రెవెన్యూ డివిజన్ తూఫ్రాన్
అసెంబ్లీ నియోజకవర్గంగజ్వేల్
లోకసభ నియోజకవర్గంమెదక్
తూఫ్రాన్  మెదక్ జిల్లాకు చెందిన మండలము. మండలం గుండా 7వ నెంబరు జాతీయ రహదారి మరియు రైల్వేలైను వెళ్ళుచున్నాయి.  విప్లవకవి గద్దర్ తూఫ్రాన్‌లో జన్మించారు. అక్టోబరు 11, 2016న తూఫ్రాన్ మండలంలోని 14 గ్రామాలను విడదీసి కొత్తగా మనోహరబాద్ మండలాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం తూఫ్రాన్ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం తూఫ్రాన్ రెవెన్యూ డివిజన్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
44వ నెంబరు జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. అల్లాపూర్ పరిసరాలలో జాతీయ రహదారిపై టోల్‌గేట్ ఉంది

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం మెదక్ జిల్లాలో తూర్పువైపున సిద్ధిపేట జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన చేగుంట మండలం, దక్షిణాన మనోహరబాద్ మండలం, పశ్చిమాన శివంపేట మండలం, వాయువ్యాన ఎల్దుర్తి మండలం, తూర్పున సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 60390. ఇందులో పురుషులు 30223, మహిళలు 30167. అక్షరాస్యుల సంఖ్య 34833.

రవాణా సౌకర్యాలు:
44వ నెంబరు జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు నుంచి నిజామాబాదు వెళ్ళు రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది.

రాజకీయాలు:
ఈ మండలం గజ్వేల్ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.


మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Allapur, Brahmanapally, Datarpally, Ghanpur, Gundareddipally, Hussainpur (DP), Imampur, Islampur, Jandapally, Kistapur, Konaipally, Pattibegampet), Majeedpally (DP), Malkapur, Nagulapally, Narsampally Patti Velur , Padalpally, Ravelli, Toopran, Vattur, Venkatapur @ Patti toopran, Venktaipally, Yavapur

ప్రముఖ గ్రామాలు
బ్రాహ్మణపల్లి (Brahmanapalli):
బ్రాహ్మణపల్లి  మెదక్ జిల్లా తూప్రాన్ మండలమునకు చెందిన గ్రామము. 1985 నుండి 1988 వరకు బారత వైమానికదళాధిపతిగా పనిచేసిన డెన్నిస్ ఆంటోని లా పోటేన్ పదవివరమణ అనంతరం ఈ గ్రామంలో స్థిరపడ్డారు. ఏప్రిల్ 6, 2011న మరణించారు.
మల్కాపూర్ (Malkapur):
మల్కాపూర్ మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలమునకు చెందిన గ్రామము. ఆగస్టు 15, 2018న తూఫ్రాన్ మండలం మల్కాపూర్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కంటివెలుగు పథకాన్ని ప్రారంభించారు.
తూఫ్రాన్ (Tupran):
తూఫ్రాన్ మెదక్ జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఇది జాతీయ రహదారి నెంబర్ 44 పై ఉంది. విప్లవకవి గద్దర్ తూఫ్రాన్‌లో జన్మించారు.




ఇవి కూడా చూడండి:


ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: మెదక్ జిల్లా మండలాలు,  తూఫ్రాన్ మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Medak Dist, 2016,
  • Handbook of Census Statistics, Medak District, 2011,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 238 తేది: 11-10-2016 
  • మెదక్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


About Toopran or Tufran, Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక