బిర్కూరు కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, xx గ్రామపంచాయతీలు, 15 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలోని గ్రామాలన్నీ పూర్వపు బాన్సువాడ తాలుకాలోని గ్రామాలు. ఈ మండలం బాన్సువాడ రెవెన్యూ డివిజన్, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలం పశ్చిమ సరిహద్దు గుండా మంజీరానది ప్రవహిస్తోంది.
2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో బిర్కూరు మండలంలోని 16 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటుచేసిన నస్రుల్లాబాదు మండలంలో కలిపారు. అదేసమయంలో ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: బిర్కూరు మండలం కామారెడ్డి జిల్లాలో ఉత్తరం వైపున నిజామాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున నస్రుల్లాబాదు మండలం, ఆగ్నేయాన బాన్సువాడ మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన బిచ్కుంద మండలం, వాయువ్యాన మద్నూరు మండలం, ఉత్తరాన నిజామాబాదు జిల్లా సరిహద్దుగా ఉంది. పశ్చిమ సరిహద్దులో బిచ్కుంద మండలం సరిహద్దు గుండా మంజీరానది ప్రవహిస్తోంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 47114. ఇందులో పురుషులు 23300, మహిళలు 23814. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 50463. ఇందులో పురుషులు 24611, మహిళలు 25852. రాజకీయాలు: ఈ మండలము బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రకారం మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు కలవు. 2019లో భిక్నూరు ZPTCగా తెరాస పార్టీకి చెందిన తానబుడ్డి స్వరూప ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bairapur, Barangedgi, Birkoor, Chincholi, Chinna Annaram, Chinna Damarancha, Kishtapur, Mallapur, Nagapur, Pedda Damarancha, Poshetpalle, Sambapur, Sultanpur, Timmapur, Veerapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బిర్కూరు (Birkur) :బిర్కూరు కామారెడ్డి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అక్టోబరు 11, 2016కు ముందు ఈ గ్రామం నిజామాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో చేరింది. బిర్కూరులో వ్యవసాయ మార్కెట్ కమిటి ఉంది. గ్రామానికి సమీపంనుంచి మంజీరానది ప్రవహిస్తోంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Birkur Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి