22, మే 2019, బుధవారం

సిల్క్‌స్మిత (Silk Smitha)

జననండిసెంబరు 2, 1960
రంగంసినీనటి
మరణంసెప్టెంబరు 23, 1996
శృంగారనటిగా పేరుపొందిన సిల్క్‌స్మిత  డిసెంబరు 2, 1960న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో జన్మించింది. ఈమె అసలుపేరు విజయలక్ష్మి. 1979లో తొలిసారిగా వండిచక్కరం అనే తమిళ సినిమాలో సిల్క్ పాత్రలో నటించి ప్రసిద్ధి చెంది దాన్నే తనపేరుగా మార్చుకుంది. తన సినీజీవితంలో సిల్క్‌స్మిత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో 450కు పైగా  సినిమాలలో నటించింది.

సిల్క్‌స్మిత అవివాహితగానే ఉంది. కాని తన జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించుటవల్ల చివరిదశలో అతను సరైన ఆదరణ చూపలేకపోవుట వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లుగా సూసైడ్ నోట్‌లో పేర్కొంది. సెప్టెంబరు 23, 1996న చెన్నైలో ఆత్మహత్య చేసుకున్న తర్వాత పలురకాలుగా కేసును పరిశీలించిననూ వ్యక్తి గురించి ఎలాంటి ఆధారం లభించలేదు.

2011లో సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా హిందీలో ఏక్తకపూర్‌చే డర్టీలైఫ్ సినిమా తీయబడింది. ఈ సినిమాలో సిల్క్‌స్మిత పాత్రను విద్యాబాలన్ పోషించింది. తమ అనుమతి లేకుండా సిల్క్‌స్మిత జీవితాన్ని తప్పుగా తెరకిక్కించడాన్ని ఆమె సోదరుడు తప్పుపట్టడంతో ఇది సిల్క్‌స్మిత జీవితకథ కాదని తర్వాత పేర్కొన్నారు.

విభాగాలు: సినీనటులు


 = = = = =


Tags: Biography of Silk Smitha, about Silk Smitha

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక