పిట్లం కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 27 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల పరిధిలో కాకివాగు ప్రవహిస్తోంది. సంగారెడ్డి నుంచి నాందేడ్ మీదుగా అకోలా వెళ్ళు 161 నెంబరు జాతీయ రహదారి మండలకేంద్రం మీదుగా వెళ్ళుచున్నది. ఉత్తర సరిహద్దు గుండా మంజీరానది ప్రవహిస్తోంది.
2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో పిట్లం మండలంలోని ఒక గ్రామాన్ని విడదీసి కొత్తగా ఏర్పాటుచేసిన పెద్దకోడప్‌గల్ మండలంలో కలిపారు. అదేసమయంలో ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: పిట్లం మండలం కామారెడ్డి జిల్లాలో దక్షిణం వైపున సంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున నిజాంసాగర్ మండలం, ఉత్తరాన బాన్సువాడ మండలం, పశ్చిమాన బిచ్కుంద మండలం మరియు పెద్దకోడప్‌గల్ మండలం, దక్షిణాన సంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున బాన్సువాడ సరిహద్దులో మంజీరానది ప్రవహిస్తోంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 46988. ఇందులో పురుషులు 23351, మహిళలు 23637. రాజకీయాలు: ఈ మండలము జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Allapur, Bandapalle, Bollakpalle, Brahmanpalle, Burnapur, Chillangi, Chinna Gouraram, Chinna Kodapgal, Dharmaram, Godamgaon, Hasnapur, Karegaon, Khambapur, Kishtapur, Koranpalle, Kurthi, Maddelchervu, Mardanda, Nagampalle, Paredpalle, Pedda Annaram, Pedda Rampur, Pitlam, Pothreddypalle, Siddapur, Sonpet, Thimmanagar
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
చిన్న కోడప్‌గల్ (China Kodapgal):చిన్న కోడప్‌గల్ కామారెడ్డి జిల్లా పిట్లం మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ రామేశ్వరాలయం ఉంది. జిల్లా నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కుర్తి (Kurti): కుర్తి కామారెడ్డి జిల్లా పిట్లం మండలమునకు చెందిన గ్రామము. మంజీరానదిలో ఉన్న ద్వీప గ్రామమే కుర్తి. గ్రామానికి ఎగువన నిజాం సాగర్ ప్రాజెక్తు ఉంది. గ్రామస్థులు వ్యవసాయం చేస్తుంటారు. 1987లో ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Pitlam Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి