దౌల్తాబాదు సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. దౌల్తాబాదు సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు. సిరిపురం గ్రామ నడిబొడ్డునగల ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రాచీనమైన శిలాశాసనం ఉంది. మనోహరబాదు నుంచి కొత్తపల్లి వరకు కొత్తగా నిర్మిస్తున్న రైలుమార్గం మండలం గుండా వెళుతుంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పాటుచేసిన సిద్ధిపేట జిల్లాలో చేర్చబడింది.. అదేసమయంలో ఈ మండలంలోని 13 గ్రామాలకు విడదీసి కొత్తగా రాయిపోల్ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: దౌల్తాబాదు మండలం సిద్ధిపేట జిల్లాలో పశ్చిమం వైపున మెదక్ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన మిర్‌దొడ్డి మండలం, తూర్పున తొగుట మండలం, ఆగ్నేయాన రాయిపోల్ మండలం, పశ్చిమాన మరియు దక్షిణాన మెదక్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 53776. ఇందులో పురుషులు 26806, మహిళలు 26970. అక్షరాస్యుల సంఖ్య 25617. రాజకీయాలు: ఈ మండలం దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Appaipally, Chandampally (DP), Deepayampally, Dommat, Doultabad, Godugupally, Govindapur, Indupriyal, Konapur ijara, Lingarajpally, Machanpally, Mohamadshapur, Mubaraspur, Narasampally (Patti Dommat), Rangampet (DP), Seethrampally, Seripally Bandaram, Surampally, Tirmalapur, Upperpally
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
...:... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Doulthabad or Doultabad Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి