రాయిపోల్ సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, xx గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. సిరిపురం గ్రామ నడిబొడ్డునగల ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రాచీనమైన శిలాశాసనం ఉంది. వడ్డేపల్లి గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఉంది.
2016కు ముందు మండలంలోని గ్రామాలు మెదక్ జిల్లాలో ఉండేవి. అక్టోబరు 11, 2016 నాడు ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు దౌల్తాబాదు మండలంలో ఉన్న 13 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: రాయిపోల్ మండలం సిద్ధిపేట జిల్లాలో పశ్చిమం వైపున మెదక్ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున గజ్వేల్ మండలం, దక్షిణాన వర్గల్ మండలం, వాయువ్యాన మరియు ఉత్తరాన దౌల్తాబాదు మండలం, ఈశాన్యాన తొగుట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 53776. ఇందులో పురుషులు 26806, మహిళలు 26970. అక్షరాస్యుల సంఖ్య 25617. రాజకీయాలు: ఈ మండలం దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Anajipur, Ankireddipally, Arepally (Sivar Jaligaon), Begumpet, Chinna Masanpally, Kothapally, Lingareddipally, Mantoor, Raipole, Ramaram, Ramasagar, Waddepally, Yelkal
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కొత్తపల్లి (Kothapally):2012 మార్చి 14 నాడు గ్రామంలో పురాతన కట్టడాలకు సంబంధించిన భారీ బండరాళ్ళు, చెక్కిన రాళ్ళు బయటపడ్డాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Raipole Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి