హుస్నాబాదు సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు. సిద్ధిపేట నుంచి హన్మకొండ వెళ్ళు రహదారి హస్నాబాద్ మీదుగా వెళ్ళుచున్నది. 2007లో మండలంలోని గుడాటిపల్లి, గండిపల్లి వద్ద రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అక్టోబరు 11, 2016 నాడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలో చేర్చబడింది. అదే సమయంలో ఈ మండలంలోని 13 గ్రామాలకు విడదీసి కొత్తగా అక్కన్నపేట మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: హస్నాబాదు మండలం సిద్ధిపేట జిల్లాలొ తూర్పువైపున కరీంనగర్ జిల్లా మరియు వరంగల్ గ్రామీణ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి దక్షిణాన అక్కన్నపేట మండలం, పశ్చిమాన కోహెడ మండలం, తూర్పున వరంగల్ గ్రామీణ జిల్లా, ఉత్తరాన కరీంనగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 78538. ఇందులో పురుషులు 39531, మహిళలు 39007. అక్షరాస్యుల సంఖ్య 45421. రాజకీయాలు: ఈ మండలము హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Husnabad, Kuchanpally, Madudha, Mirzapur, Mohammadapur, Nagaram, Pandilla, Potharam (S), Potlapally, Thotapally (S), Ummapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
హుస్నాబాదు (Husnabad):హుస్నాబాదు సిద్ధిపేట జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఇది పురపాలక సంఘము మరియు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రము. 2001 లెక్కల ప్రకారం పట్టణ జనాభా 19456. పొట్లపల్లి (Potlapally): పొట్లపల్లి సిద్ధిపేట జిల్లా హుస్నాబాదు మండలమునకు చెందిన గ్రామము. పొట్లపల్లి పరిధిలోని దేవేంద్రనగర్ సమీపంలో ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో ఆదిమానవుల సమాధులు (రాకాసిగుళ్ళు) ఉన్నాయి. 2012 జూన్ 18న స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయం సమీపంలో పురాతన కాలం నాటి మట్టిపాత్ర లభించింది. త్రైలోక్యమల్ల మొదటి సోమేశ్వరుని కాలంలో ఈ గ్రామం పేరు పొట్లపల్లియ. ఇక్కడ వేలాది మునులు తపస్సుచేసేవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Husnabad Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి