అక్కన్నపేట సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. 2007లో మండలంలోని గుడాటిపల్లి, గండిపల్లి వద్ద రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ మండలం హుస్నాబాదు రెవెన్యూ డివిజన్, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
అక్టోబరు 11, 2016 నాడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలో చేర్చబడింది. భౌగోళికం, సరిహద్దులు: అక్కన్నపేట మండలం సిద్ధిపేట జిల్లాలో తూర్పువైపున జనగామ మరియు వరంగల్ గ్రామీణ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన హుస్నాబాదు మండలం, పశ్చిమాన నంగనూరు మండలం, నైరుతిన మద్దూరు మండలం, వాయువ్యాన కోహెడ మండలం, తూర్పున వరంగల్ గ్రామీణ జిల్లా, దక్షిణాన జనగామ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 12 ఎంపీటీసి స్థానాలున్నాయి. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akkannapeta, Anthakkapeta, Choutapally, Dongala Dharmaram, Gandipally, Gouravelli, Jangaon, Katkur, Kesavapur, Mallampally, Nandaram, Potharam (J), Ramavaram, Regonda
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గండిపల్లి (Gandipalli):గండిపల్లి సిద్ధిపేట జిల్లా హుస్నాబాదు మండలమునకు చెందిన గ్రామము. 2007లో గ్రామ సమీపంలో రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోవర్థనగిరి (Govarthanagiri): గోవర్థనగిరి సిద్ధిపేట జిల్లా హుస్నాబాదు మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో సంజీవరాయుని గుట్ట ఉంది. ఇక్కడ నిజాం కాలంలో ఎత్తయిన కోటగోడను నిర్మించారు. సంజీవరాయుని గుట్టపై ఆంజనేయస్వామి ఆలయం ఉంది. కేశవాపూర్ (Keshawapur): కేశవాపూర్ సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామంలో పార్వతి,పరమేశ్వరీ ఆలయం ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Akkannapet Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి