కోహెడ సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు,16 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం హస్నాబాదు రెవెన్యూ డివిజన్, హస్నాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలో మోయతుమ్మెద నది ప్రవహిస్తోంది. నిజాం కాలంలో నిర్మించిన శనిగరం ప్రాజెక్టు మండలంలో ఉంది.
అక్టోబరు 11, 2016 నాడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలో చేర్చబడింది. భౌగోళికం, సరిహద్దులు: కోహెడ మండలం సిద్ధిపేట జిల్లాలో ఈశాన్యంలో కరీంనగర్ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున హస్నాబాదు మండలం, ఆగ్నేయాన అక్కన్నపేట మండలం, దక్షిణాన నంగనూరు మండలం, పశ్చిమాన చిన్నకోడూర్ మండలం, ఉత్తరాన బెజ్జంకి మండలం, ఈశాన్యాన కరీంనగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44640. ఇందులో పురుషులు 22266, మహిళలు 22374. అక్షరాస్యుల సంఖ్య 25579. రాజకీయాలు: ఈ మండలము హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 13 ఎంపీటీసి స్థానాలున్నాయి. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Baswapur, Gottalamitta, Gundareddipalli, Kachapur, Koheda, Kurella, Nakkira Kommula, Narayanapur, Pariveda, Ramachandrapur, Samudrala, Sanigaram, Sriramulapally, Thangallapalli, Varikolu, Vinjapally
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
శనిగరం (Shanigaram):శనిగరం సిద్ధిపేట జిల్లా కోహెడ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ నిజాం పాలనలో మధ్యతరహా ప్రాజెక్టు నిర్మించబడింది. కాకతీయ పాలకుడు మొదటి ప్రోలరాజు వేయించిన శాసనం శనిగరంలో ఉంది. చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య కృషిమూలంగా ఇది వెలుగులోకి వచ్చింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Koheda Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి