మద్దూరు సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. కేంద్ర మంత్రిగా పనిచేసిన కమాలుద్దీన్ అహ్మద్ ఈ మండలమునకు చెందినవారు. అక్టోబరు 11, 2016 నాడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలో చేర్చబడింది. డిసెంబరు 8, 2020న మద్దూరు మండలాన్ని విభజించి 8 గ్రామాలతో కొత్తగా దూలిమిట్ట మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: మద్దూరు మండలం సిద్ధిపేట జిల్లాలో దక్షిణంవైపున జనగామ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన చేర్యాల మండలం, ఉత్తరాన నంగనూరు మండలం, ఈశాన్యాన అక్కన్నపేట మండలం, తూర్పున మరియు దక్షిణాన జనగామ జిల్లా సరిహద్దుగా ఉంది. రాజకీయాలు: ఈ మండలము జనగామ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 11 ఎంపీటీసి స్థానాలున్నాయి.
మద్దూరు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Arjunapatla, Bairanpally, Bekkal, Dharmaram, Dhoolumitta, Gagillapoor, Jalapally, Kamalayapally, Ladunoor, Lakkapally, Lingapoor, Maddur, Marmamula, Narasaipally, Rebarthi, Salakpoor, Thoranala, Vallampatla, Vangapally
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
భైరాన్‌పల్లి సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలమునకు చెందిన గ్రామము. 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు వరంగల్ జిల్లాలో ఉండేది. 1947-48లో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ఈ గ్రామం పేరుప్రఖ్యాతులు సంపాదించింది. పలుమార్లు గ్రామస్థులు రాజాకార్లకు ఎదుర్కొనగా 1948 ఆగస్టు 27న 1200 మంది సైనికులు, రజాకార్లు ఆయుధాలతో వచ్చి గ్రామస్థులను పట్టుకొని సుమారు 116 మందిని వరసలో నిలబెట్టి కాల్చిచంపారు. ఇది భైరాన్‌పల్లి సంఘటనగా ప్రసిద్దిచెందినది. తర్వాత ఆ ప్రాంతంలో అమరవీరుల స్తూపం నిర్మించారు. ఇది తెలంగాణ జలియన్‌వాలా బాగ్‌గా ప్రసిద్ధి చెందింది. సలాఖ్ పూర్ (Salakhpur): సలాఖ్ పూర్ సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది కేంద్ర మంత్రిగా పనిచేసిన కమాలుద్దీన్ అహ్మద్ స్వగ్రామం. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Maddur Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి