చేర్యాల సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజన్, జనగామ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలకేంద్రం చేర్యాల నకాశీ చిత్రకళకు ప్రసిద్ధి చెందింది. ఆకునూరు గ్రామం విమోచనోద్యమంలో ప్రముఖపాత్ర పోషించింది.
అక్టోబరు 11, 2016 నాడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలో చేర్చబడింది. అక్టోబరు 11, 2016 నాడు ఈ మండలంలోని 9 గ్రామాలకు విడదీసి కొత్తగా కొమురవెల్లి మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు చేర్యాల మండలం జిల్లాలో అతి పశ్చిమాన ఉండేది. ఇప్పుడు సిద్ధిపేట జిల్లాలో దక్షిణంవైపున జనగామ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున మద్దూరు మండలం, ఉత్తరాన నంగనూరు మండలం, పశ్చిమాన కొమురవెల్లి మండలం, నైరుతిన జగదేవ్‌పూర్ మండలం, వాయువ్యాన కొండపాక మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 70540. ఇందులో పురుషులు 35265, మహిళలు 35275. రాజకీయాలు: ఈ మండలము జనగామ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో ఒక పురపాలక సంఘం, 11 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akunoor, Cherial, Chityal, Chunchankota, Danampally, Dommata, Kadavergu, Musthiyala, Nagapuri, Pedarajupet, Tadoor, Vechareni
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఆకునూరు (Akunuru):ఆకునూరు సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలమునకు చెందిన గ్రామము. మండలంలో ఇదే పెద్ద గ్రామపంచాయతి. 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముంది ఇది వరంగాల్ జిల్లాలో ఉండేది. గ్రామంలో 2 ఎంపీటీసి స్థానాలు, 12 పంచాయతీ వార్డులు, 6000 జనాభా ఉంది. ఈ గ్రామం చేర్యాల నుంచి నంగనూరు వెళ్ళు రహదారిపై ఉంది. గ్రామసమీపం నుంచి పెద్దవాగు ప్రవహిస్తోంది. చేర్యాల (Cheryal): చేర్యాల సిద్ధిపేట జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. 2018లో ఇది కొత్తగా పురపాలక సంఘంగా ఏర్పడింది. 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముంది ఇది వరంగాల్ జిల్లాలో ఉండేది. ఈ పట్టణం నకాశీ చిత్రకళకు ప్రసిద్ధి చెందింది. 1987లో మండలాల అవతరణకు ముంది ఇది తాలుకా కేంద్రంగా ఉండేది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Cheryal Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి