నస్రుల్లాబాదు కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. దూర్వాస మహాముని పాలించిన పట్టణంగా చెప్పబడుతున్న దుర్కి ఈ మండలంలోనే ఉంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు బిర్కూరు మండలంలోని 16 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: నస్రుల్లాబాదు మండలం కామారెడ్డి జిల్లాలో ఉత్తరం వైపున నిజామాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి దక్షిణాన బాన్సువాడ మండలం, పశ్చిమాన బిర్కూరు మండలం, ఉత్తరాన మరియు తూర్పున నిజామాబాదు జిల్లా సరిహద్దుగా ఉంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 47114. ఇందులో పురుషులు 23300, మహిళలు 23814. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 50463. ఇందులో పురుషులు 24611, మహిళలు 25852. రాజకీయాలు: ఈ మండలము బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రకారం మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు కలవు. 2019లో నసురుల్లాబాదు ZPTCగా తెరాస పార్టీకి చెందిన జన్నుబాయి సలావత్ ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ankole, Baswaipalle, Bommandevpalle, Boppaspally, Doulatapur, Durgampalle, Durki, Hajipur, Kamshetpalle, Mailaram, Mirzapur, Nachupally, Nasarullabad, Nemli, Sangem, Timmanagar
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
దుర్కి (Durki):దుర్కి కామారెడ్డి జిల్లా బిర్కూరు మండలమునకు చెందిన గ్రామము. గ్రామ శివారులో శ్రీసోమేశ్వరస్వామి ఆలయం ఉంది. దుర్వాస మహాముని తన శిష్యులతో కలిసి తపస్సు చేసిన ప్రాంతంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. ఆలయంలో కళ్యాణి చాళుక్య చక్రవర్తి మూడో సోమేశ్వరుని శాసనం ఉంది. మైలారం (Mailaram): మైలారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలమునకు చెందిన గ్రామము. గ్రామపరిధిలో ఉన్న 50 ఈడలు కలిగిన పెద్ద మర్రిచెట్టు కింద మైసమ్మ దేవత మహిమ గలదిగా పూజలందుకుంటోంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Nasrullabad Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి