వర్గల్ సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు. నాచగిరిలో ప్రఖ్యాతిచెందిన శ్రీలక్ష్మీ నృసింహక్షేత్రం ఉంది. ఇది తెలంగాణలో రెండో యాదాద్రిగా ప్రసిద్ధి చెందింది. మండలకేంద్రం వర్గల్‌లో సరస్వతీ ఆలయం, శనీశ్వర ఆలయం ఉన్నాయి. మనోహరబాదు నుంచి కొత్తపల్లి వరకు కొత్తగా నిర్మిస్తున్న రైలుమార్గం మండలం గుండా వెళుతుంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: వర్గల్ మండలం సిద్ధిపేట జిల్లాలో పశ్చిమం వైపున మెదక్ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన రాయిపోల్ మండలం, ఈశాన్యాన గజ్వేల్ మండలం, తూర్పున మర్కూర్ మండలం, దక్షిణాన ములుగు మండలం, పశ్చిమాన మెదక్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44596. ఇందులో పురుషులు 22587, మహిళలు 22009. అక్షరాస్యుల సంఖ్య 22062. రాజకీయాలు: ఈ మండలం గజ్వేల్ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు కలవు.. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Amberpet, Ananthagiripally, Chandapur, Girmapur, Gouraram, Govindapur, Jabbapur, Kondaipally (DP), Madharam, Majidpally, Meenajipet, Mylaram, Nacharam, Nemtur, Ramachandrapur (DP), Shakaram, Singaipally, Sitarampally, Tunki Makta, Tunkikhalsa, Veluru, Wargal
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
నాచగిరి (Nachagiri):నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం ఈ గ్రామంలోనే ఉంది. హరిద్రా నది తీరాన ఉన్న ఈ క్షేత్రం తెలంగాణలో రెండో యాదాద్రిగా ప్రసిద్ధి చెందింది. వర్గల్ (Wargal): వర్గల్ లో సరస్వతీ ఆలయం, శనైశ్వరస్వామి ఆలయం ఉన్నాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Wargal pr Vargal Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి