ములుగు సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 24 రెవెన్యూ గ్రామాలు కలవు. ములుగు మండలంలోని కొన్ని గ్రామాలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ రిజర్వాయర్ పరిధిలోకి వస్తాయి.
ఈ మండలం గజ్వేల్ రెవెన్యూ డివిజన్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. అక్టోబరు 11, 2016న ఈ మండలం మెదక్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన సిద్ధిపేట జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ములుగు మండలం సిద్ధిపేట జిల్లాలో నైరుతిమూలలో మెదక్ జిల్లా మరియు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన వర్గల్ మండలం, తూర్పున మర్కూక్ మండలం, దక్షిణాన మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, పశ్చిమాన మెదక్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44050. ఇందులో పురుషులు 22152, మహిళలు 21898. అక్షరాస్యుల సంఖ్య 22192. రాజకీయాలు: ఈ మండలం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు కలవు.
ములుగు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Achaipally, Aliabad @ Adivimasjid, Banda Mailaram, Banda Thimmapur, Baswapur Izara, Bhailampur, Chilla Sagar, Chinna Thimmapur, Dasarlapally, Gangadharpally, Kokkonda, Kothial, Kothur, Lakshmakkapally, Mamidiyal, Mulug, Mustafa Guda, Narsampally, Narsapur, Singannaguda, Srirampur, Thanedharpally, Tuniki Bollaram, Zapthi Singaipally
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
భైలంపూర్ (Bhailampur):భైలంపూర్ సిద్ధిపేట జిల్లా ములుగు మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ రిజార్వాయర్ పరిధిలోకి వస్తుంది. కొక్కండ (Kokkanda): కొక్కండ సిద్ధిపేట జిల్లా ములుగు మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామంలో చాలా వరకు బండలు విస్తరించియున్నాయి. బండల పైనే గ్రామస్థులు ఇళ్ళు నిర్మించుకున్నారు. బండలపై చరిత్ర గుర్తులెన్నో ఉన్నాయి. బండపై చెరువు కూడా ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Mulu or Mulugu Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి