కోటగిరి నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 28 గ్రామపంచాయతీలు, 34 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలోని గ్రామాలన్నీ పూర్వపు బోధన్ తాలుకాలోని గ్రామాలు. అక్టోబరు 11, 2016న ఈ మండలంలోని 5 గ్రామాలను కొత్తగా ఏర్పాటుచేసిన రుద్రూర్ మండలంలో విలీనం చేశారు. మండలం పశ్చిమ సరిహద్దు గుండా మంజీరానది ప్రవహిస్తోంది.
భౌగోళికం, సరిహద్దులు: కోటగిరి మండలం నిజామాబాదు జిల్లాలో పశ్చిమాన మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన బోధన్ మండలం, తూర్పున రుద్రారం మండలం, దక్షిణాన కామారెడ్డి జిల్లా, పశ్చిమాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 56786. ఇందులో పురుషులు 27934, మహిళలు 28852. రాజకీయాలు: ఈ మండలము బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రకారం మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Adkas Pally, Amrapur, Bareedpur, Baswapur, Domaledgi, Eklaspur, Ethonda, Fakeerabad, Gannavaram, Hangerga, Hegdoli, Humnapur, Jallapalli, Kallur, Karegoan, Kodcherla, Kollur, Kotgiri, Kothapally, Lingapur, Malkapur, Mirzapur, Pothangal, Rampur, Rozapur, Shailampur, Sompur, Suddulam, Sunkini, Takli, Tirmalapur, Vallabhapur, Yadgarpur, Zainapur
ప్రముఖ గ్రామాలు
..: ...
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kotagiri Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి