సినీనటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, వాణిజ్యవేత్తగా ప్రసిద్ధిచెందిన మాగంటి మురళీమోహన్ జూన్ 24, 1940న పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో జన్మించారు. ఈయన అసలు పేరు మాగంటి రాజబాబు. 1973లో జగమే మాయ సినిమా ద్వారా సినీప్రస్థానం ప్రారంభించిన మురళీమోహన్ 1974లో దాసరి నారాయణరావు దర్శకత్వంలోని తిరుపతి సినిమా ద్వారా గుర్తింపు పొంది తన సినీ జీవితంలో 350 పైగా సినిమాలలో నటించారు. 1985లో ఓ తండ్రి తీర్పు సినిమాలో నటనకు గాను ఉత్తమనటుడిగా నంది అవార్డు పొందారు. నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పోరేషన్ లలో పలు పదవులు నిర్వహించారు. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కు 2015 వరకు గౌరవ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1980లో సోదరుడు కిశోర్‌తో కలిసి జయభేరి ఆర్ట్స్ పేరిట స్వంత నిర్మాణసంస్థను ప్రారంభించి పలు చిత్రాలు తీశారు.
2009లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజమండ్రి నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2014లో కూడా రాజమండ్రి నుంచి తెదేపా తరఫున పోటీచేసి వైకాపాకు చెందిన బొడ్డు వెంకటరమణా చౌదరిపై పోటీచేసి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైనారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి జయభేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
24, జూన్ 2019, సోమవారం
మురళీమోహన్ (Murali Mohan)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి