డిచ్‌పల్లి నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు, 34 గ్రామపంచాయతీలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు - నాందేడ్ రైలు మార్గం మండల గుండా వెళ్ళుచున్నది. 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మండవ వెంకటేశ్వరరావు ఈ మండలమునకు చెందినవారు. ఖజూరాహో తరహాలో శృంగార శిల్పాలున్న డిచ్‌పల్లి ఖిల్లారామాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధానస్థావరం, కుష్టురోగులకు సేవలందించే దేవునగర్ క్యాంపు మండలంలో ఉన్నాయి.
అక్టోబరు 11, 2016న ఇందల్వాయి మండలంలోని రాంపూర్, బీబీపూర్ గ్రామాలను, ముగ్పాల్ మండలంలోని ముల్లంగి గ్రామాన్ని ఈ మండలంలో కలిపారు. అదేసమయంలో ఇందల్వాయితో సహా 4 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పడిన ఇందల్వాయి మండలంలో కలిపారు. భౌగోళికం, సరిహద్దులు: డిచ్‌పల్లి మండలానికి తూర్పున ధర్పల్లి మండలం, దక్షిణాన ఇందల్‌వాయి మండలం, పశ్చిమాన ముగ్పాల్ మండలం, వాయువ్యాన నిజామాబాదు గ్రామీణ మండలం, ఉత్తరాన మాక్లూర్ మండలం మరియు జక్రాన్‌పల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 77197. ఇందులో పురుషులు 37767, మహిళలు 39430. పట్టణ జనాభా 5189, గ్రామీణ జనాభా 72008. రాజకీయాలు: ఈ మండలం నిజామాబాదు (గ్రామీణ) అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Amruthapur, Arepalli, Bardipur, Bibipur, Dichpally, Doosgaon, Ghanpur (CT), Kamalapur, Koratpalli, Mentrajpalli, Mittapalli, Mullangi (I), Nadepalli, Rampur, Suddapalli, Suddulam, Yanampalli
ప్రముఖ గ్రామాలు
ధర్మారం (బి) (Dharmaram-B): ధర్మారం (బి) నిజామాబాదు జిల్లా డిచ్‌పల్లి మండలమునకు చెందిన గ్రామము. తెలుగుదేశం నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మండల వెంకటేశ్వరరావు స్వగ్రామం. గ్రామంలో కేథలిక్ చర్చి ఉంది. డిచ్‌పల్లి (Dichpally): డిచ్‌పల్లి నిజామాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది ప్రాచీనమైన గ్రామము. పూర్వం ఇది దీక్షానగరమని, సీతానగరమని పిలువబడింది. తర్వాత డచ్ వారి వశమైనది. అందుచే డచ్ పల్లిగా పేరుమారి, చివరకు డిచ్‌పల్లి అయింది. గ్రామంలో గుట్టమీద ఖిల్లావంటి ఆలయ కట్టడం ఉంది. ఈ కట్టడాన్ని ఎవరు నిర్మించారనేది ఖచ్చితమైన ఆధారాలు లేవు. 17వ శతాబ్దిలో విజయనగర రాజులు వారి విజయాలకు చిహ్నంగా గజకేసరి విగ్రహస్తంభాలను నిర్మించారనే ఒక బలమైన అభిప్రాయం ఉంది. కోట పైభాగాన వాత్సాయనుని కామసూత్రాలననుసరించి శిల్పించబడిన అద్భితమైన శృంగాల శిల్పచిత్రాలున్నాయి. ఈ కట్టడంలో 1947 వరకు ఏ విగ్రహంలేకుండెను. కాని డిచ్‌పల్లి నివాసి గుడివాడ చిన్నయ్యచే 1947లో సీతారాముల విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. అప్పటి నుంచి ఇది రామాలయం అయింది. 2006లో డిచ్‌పల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Maklur pr Makloor Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి