నందిపేట నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 20 ఎంపీటీసి స్థానాలు, 32 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలమునకు ఉత్తరాన గోదావరి నది సరిహద్దుగా ఉంది. గుత్ప ఎత్తిపోతల పథకాన్ని మండలంలోని ఉమ్మెడ గ్రామంలో నిర్మిస్తున్నారు.
పాత కుప్తాపురం గ్రామంలో పురాతన రామలింగేశ్వరాలయం ఉంది. ఇది శ్రీరాంసాగర్ జలాశయంలో ముంపునకు గురైంది. వేసవిలో నీరు పూర్తిగా తగ్గినప్పుడు ఈ ఆలయం బయటపడుతుంది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం నిజామాబాదు జిల్లాలో ఉత్తరం వైపున నిర్మల్ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున మెండోరా మండలం, ముప్కాల్ మండలం, దక్షిణాన ఆర్మూర్ మండలం, మాక్లూర్ మండలం, పశ్చిమాన నవీపేట్ మండలం, ఉత్తరాన నిర్మల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 70651. ఇందులో పురుషులు 33705, మహిళలు 36946. స్త్రీపురుష నిష్పత్తిలో (1096/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది. రాజకీయాలు: ఈ మండలము ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. పునర్విభజనకు ముందు ఇది బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. 2019 ప్రకారం మండలంలో 20 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ailapur, Annaram, Badgoni, Bazarkothur, C.H.Kondoor, Chimrajpalle, Dattapur, Donkeshwar, Gadepally, Gangasamundar, Joorpur, Kamtam, Khudavandapur, Komatpally, Kushtapur, Lakkampally, Mallaram, Marampally, Mayapur, Nandipet, Narkodh, Nikalpur, Noothpally, Shahpur, Siddapur, Sirpur, Srirampur, Talveda, Tondakur, Ummeda, Vannel(Khurd), Velmal
ప్రముఖ గ్రామాలు
నందిపేట (Nadipet): నందిపేట నిజామాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము.. ఇక్కడ శ్రీకేదారేశ్వరస్వామి ఆలయం ఉంది. ఉమ్మెడ (Ummeda): ఉమ్మెడ నిజామాబాదు జిల్లా నందిపేట మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామము గోదావరి తీరాన ఉంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఇక్కడ పుష్కర ఘాట్ ఏర్పాటుచేశారు. గుత్ప ఎత్తిపోతల పథకాన్ని గ్రామంలో నిర్మిస్తున్నారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Nandipet Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి