మాక్లూర్ నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 30 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు. నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళు జాతీయ రహదారు మండలం మీదుగా వెళ్ళుచున్నది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన నందిపేట మండలం, తూర్పున ఆర్మూరు మండలం మరియు జక్రాన్‌పల్లి మండలం, దక్షిణాన డిచ్‌పల్లి మండలం, పశ్చిమాన నిజామాబాదు గ్రామీణ మండలం, వాయువ్యాన నవీపేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 58680. ఇందులో పురుషులు 28107, మహిళలు 30573. స్త్రీపురుష నిష్పత్తిలో 1088/వెయ్యి పురుషులకు. రాజకీయాలు: ఈ మండలము ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. పువర్వ్యవస్థీకరనకు ముందు ఇది డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. 2019 ప్రకారం మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు కలవు. 2019లో మాక్లూర్ జడ్పీటీసీ సభ్యుడిగా టీఆర్‌ఎస్ అభ్యర్ధి దాదన్నగారి విఠల్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Amrad, Bonkanpalle, Borgaon (Kalan), Chikli, Chinnapur, Dharmora, Gottimukkala, Gunjali, Gutpa, Kalladi, Lakhmapur, Madanpalle, Makloor, Mamdapur, Mamidipalle, Manik Bhandar, Metpalle, Mullangi (Binala), Singampalle, Vaddatipalle, Vallabhapur, Venkatapur
ప్రముఖ గ్రామాలు
మాణిక్ బండార్ (Manik Bandar): మాణిక్ బండార్ నిజామాబాదు జిల్లా మాక్లూర్ మండలమునకు చెందిన గ్రామము.నిజామాబాదు జిల్లా డిసిసి అధ్యక్షురాలిగా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన ఆకుల లలిత ఈ గ్రామానికి చెందినవారు. లలిత 2018 శాసనసభ ఎన్నికలలో ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Maklur pr Makloor Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి