నవీపేట్ నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 16 ఎంపీటీసి స్థానాలు, 32 గ్రామపంచాయతీలు, 32 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలము జిల్లాలో ఉత్తర భాగంలో గోదావరి నది సరిహద్దులో ఉంది. యంచ గ్రామం వద్ద న్యానకల్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరియు నిజామాబాదు మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ఈ మండలానికి చెందినవారు.
జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ప్రారంభించబడిన తొలి ఎత్తిపోతల అలీసాగర్ ఎత్తిపోతల నవీపేట మండలం కోస్లి వద్ద గోదావరినదిపై నిర్మించబడింది. భౌగోళికం, సరిహద్దులు: నవీపేట మండలం నిజామాబాదు జిల్లాలో ఉత్తరం వైపున నిర్మల్ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున నందిపేట మండలం మరియు మాక్లూర్ మండలం, దక్షిణాన నిజామాబాదు గ్రామీణ మండలం, నైరుతిన ఎడపల్లి మండలం, పశ్చిమాన రేంజల్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండల ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం నవీపేట్ మండల జనాభా 51578. ఇందులో పురుషులు 25378, మహిళలు 26200. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 55265. ఇందులో పురుషులు 26755, మహిళలు 28510. రాజకీయాలు: నవీపేట్ మండలము బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో మోహన్ రెడ్డి గెలుపొందినారు. 2019 ప్రకారం మండలంలో 16 ఎంపీటీసి స్థానాలు కలవు. 2014లో నిజామాబాదు నుంచి లోక్6సభకు ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఈ మండలానికి చెందినవారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Abbapur (B), Abbapur (M), Abhangapatnam, Alzapur, Ananthagiri, Ankampalle, Binola, Dharmaram, Dharyapur, Fathenagar, Jannipalle, Kamalapur, Kandepalle, Khadirabad, Kosli, Lingapur, Maddepalle, Mahantham, Mittapur, Mokanpalle, Nagepur, Naleshwar, Nandigaon, Narayanpur, Navipet, Nizampur, Pothangal, Rampur, Shaikhapur, Shiranpalle, Tungini, Yamcha
ప్రముఖ గ్రామాలు
బినోల (Binola): బినోల నిజామాబాదు జిల్లా నవీపేట్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం గోదావరి నది తీరాన ఉంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో గౌతమేశ్వరస్వామి ఆలయం వద్ద పుష్కర ఘాట్ ఏర్పాటుచేశారు. కోస్లి (Kosli): కోస్లి నిజామాబాదు జిల్లా నవీపేట్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం గోదావరి నది తీరాన ఉంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఇక్కడ పుష్కర ఘాట్ ఏర్పాటుచేశారు. గ్రామసమీపంలో గోదావరిపై అలీసాగర్ నిర్మించబడింది. పోతంగల్ (Potangal): పోతంగల్ నిజామాబాదు జిల్లా నవీపేట మండలమునకు చెందిన గ్రామము. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరియు నిజామాబాదు మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేగా పనిచేసిన దేవులపల్లి రామయ్యగారి భూంరావు ఈ గ్రామానికి చెందినవారు. యంచ (Yancha): యంచ నిజామాబాదు జిల్లా నవీపేట మండలమునకు చెందిన గ్రామము. యంచ గ్రామం గుట్టపై విఠలేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయానికి 300 సం.ల చరిత్ర ఉంది. 2005లో యంచ వద్ద న్యానకల్ ప్రాజెక్టు చేపట్టారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Navipet Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి