పాలకీడు సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము సూర్యాపేట రెవెన్యూ డివిజన్, హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది. మండలానికి పశ్చిమ సరిహద్దు గుండా మూసినది, దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తున్నాయి.
2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో నేరెడుచెర్ల మండలంలోని 14 గ్రామాలను విడదీసి కొత్తగా ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: పాలకీడు మండలం సూర్యాపేట జిల్లాలో వాయువ్యం వైపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు నల్గొండ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన నేరెడుచర్ల మండలం మరియు గరిడేపల్లి మండలం, తూర్పున మఠంపల్లి మండలం, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమాన నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Abangapuram, Bothalapalem, Guduguntlapalem, Gundeboinagudem, Gundlapahad, Janapahad, Komatikunta, Mahankaligudem, Musivoddu Singaram, Palakeedu, Ravipahad, Sajjapuram, Shunyapahad, Yellapuram
ప్రముఖ గ్రామాలు
జాన్ పహాడ్ (Jan Pahad): జాన్ పహాడ్ సూర్యాపేట జిల్లా పాలకీడు మండలమునకు చెందిన గ్రామము. సిమెంటు తరలించడానికి గ్రామంలో కొత్తగా రైల్వేస్టేషన్ నిర్మించారు. ఈ స్టేషన్ విష్ణుపురం, దామరచర్ల మధ్యలో ఉంది. రావిపాడు (Ravipadu): రావిపాడు సూర్యాపేట జిల్లా పాలకీడు మండలమునకు చెందిన గ్రామము. నిజాం విమోచనకారుడు దేవర అబ్బయ్య ఈ గ్రామనివాసి. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Nagaram Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి