తిరుమలగిరి సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు, 14 గ్రామపంచాయతీలు కలవు. ఈ మండలము సూర్యాపేట రెవెన్యూ డివిజన్, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. ఈ మండలానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా, తెలంగాణ పిసిస్ అధ్యక్షుడిగా ఎంపీగా ఎన్నికయ్యారు.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో మండలంలోని 4 గ్రామాలను కొత్తగా ఏర్పాటుచేసిన నాగారం మండలంలో కలిపారు. అదే సమయంలో ఈ మండలం నల్గొండ జిల్లా నుంచి కొత్తగా అవతరించిన సూర్యాపేట జిల్లాలోకి చేరింది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం సూర్యాపేట జిల్లాలో అతి ఉత్తరాన ఉన్న మండలం. ఈ మండలానికి దక్షిణాన నాగారం మండలం, ఆగ్నేయాన తుంగతుర్తి మండలం, ఉత్తరాన జనగామ మండలం, తుర్పున మహబూబాబాదు మండలం, పశ్చిమాన యాదాద్రి భువనగిరి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 47482, 2011 నాటికి జనాభా 144 పెరిగి 47626 చేరింది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47626. ఇందులో పురుషులు 24022, మహిళలు 23604. రాజకీయాలు: ఈ మండలము తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మండలానికి చెందినవారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా, నల్గొండ ఎంపిగా ఉన్నారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Anantharam, Bandlapally, Gundepuri, Jalalpur, Malipur, Mamidyala, Nandapoor, Siddisamudram, Tatipamula, Tirumalagiri, Tonda, Velichala
ప్రముఖ గ్రామాలు
తాటిపాముల (Tatipamula): తాటిపాముల సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలమునకు చెందిన గ్రామము. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వగ్రామం ఇది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Thirmalagiri or Thitumalagiri Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి