నాగారం సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. 2016 నాటి జిల్లాల పునర్విభజన సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదే సమయంలో మండలంలోని గ్రామాలు నల్గొండ జిల్లా నుంచి కొత్తగా అవతరించిన సూర్యాపేట జిల్లాలోకి మారాయి. తెలంగాణలో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఫణిగిరి ప్రాంతం నాగారం మండలంలో ఉంది. మండలం పశ్చిమ సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తోంది.
అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన ఈ మండలంలో 3 గ్రామాలు తుంగతుర్తి మండలం, 3 గ్రామాలు జాజిరెడ్డి గూడ మండలం, 4 గ్రామాలు తిరుమలగిరి మండలం నుంచి వచ్చిచేరాయి. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన తిరుమలగిరి మండలం, తూర్పున తుంగతుర్తి మండలం, దక్షిణాన జాజిరెడ్డిగూడెం మండలం, పశ్చిమాన యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దుగా ఉన్నాయి. రాజకీయాలు: మండలంలోని రెవెన్యూ గ్రామాలు: పస్తాల (Pastala), పసునూర్ (Pasunoor), లక్ష్మాపూర్ (Laxmapoor), మామిడిపల్లి (Mamidipally), ఏటూరు (Etoor), ఫణిగిరి (Panigiri), చెన్నాపూర్ (Chennapur), నాగారం (Nagaram), వర్థమానకోట (Vardaman Kota), డి.కొత్తపల్లి (D.Kothapally)
ప్రముఖ గ్రామాలు
ఫణిగిరి (Phanigiri):ఫణిగిరి సూర్యాపేట జిల్లా నాగారం మండలమునకు చెందిన గ్రామము. ఇది చారిత్రక ప్రాశస్త్యం కలిగిన గ్రామము. ఇక్కడి త్రవ్వకాలలో బౌద్ధకాలం నాటి స్తూపాలు, సభామందిరాలు బయటపడ్డాయి. ఈ గ్రామం ఒకప్పుడు బౌద్ధకేంద్రంగా విరాజిల్లినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఫణిగిరి ప్రాంతం పాము పడగ ఆకారపు ఒక కొండ పైన ఉన్నందున దీనికా పేరు వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఈ గ్రామం జనగామ-సూర్యాపేట రహదారిలో ఉంది. నాగారం (Nagaram): నాగారం నల్గొండ జిల్లా అర్వపల్లి మండలమునకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామానికి చెందిన గుంటకండ్ల జగదీశ్ రెడ్డి 2014లో సూర్యాపేట నుంచి తెలంగాణ శాసనసభకు ఎన్నికై మంత్రిమండలిలో స్థానం పొందారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Nagaram Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి