రాజంపేట కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు భిక్నూరు మరియు తాడ్వాయి మండలాలలోని 8 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం కామారెడ్డి మరియు ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం తూర్పు భాగం నుంచి సికింద్రాబాదు-నిజామాబాదు రైలుమార్గం వెళ్ళుచున్నది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం నిజామాబాదు జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వూవస్థీకరణ సమయంలో కొత్తగా అవతరించిన కామారెడ్డి జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: రాజంపేట మండలం కామారెడ్డి జిల్లాలో దక్షిణం వైపున మెదక్ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన తాడ్వాయి మండలం మరియు కామారెడ్డి మండలం, తూర్పున భిక్నూరు మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన మెదక్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2006లో తాడ్వాయి నుంచి జడ్పీటీసీగా విజయం సాధించిన వెంకటరమణారెడ్డి జడ్పీ చైర్మెన్‌గా పనిచేశారు. 2019 ప్రకారం మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Argonda (including Baswannapally Hamlet), Gundaram (including Yellareddypally Hamlet), Kondapur, Peddapalle, Pondurthi (including Shivaipally Hamlet), Rajampet, Siddapur, Talamadla మండలంలోని గ్రామపంచాయతీలు: Annaram, Arepally, Argonda, Baswannapally, Gudi Thanda, Gundram, Kondapoor, Nadimi Thanda, Peddaipally, Pondurthy, Rajampet, Sher Shankar Thanda, Shivaipally, Siddapoor, Thalamadla, Yellapur Thanda, Yellareddypally, Yellareddypally Thanda
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..:... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Rajampet Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి