కామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో ఒక పురపాలక సంఘం, 6 ఎంపీటీసి స్థానాలు, 14 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన సీతాదయాకర్ రెడ్డి, హాస్యనటుడు వెన్నెల కిశోర్ ఈ మండలమునకు చెందినవారు. మండలం మీదుగా 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు - నిజామాబాదు రైలుమార్గం వెళ్ళుచున్నాయి.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా అవతరించిన కామారెడ్డి జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున మాచారెడ్డి మండలం, ఆగ్నేయాన దోమకొండ మండలం, దక్షిణాన భిక్నూరు మండలం మరియు రాజంపేట మండలం, పశ్చిమాన తాడ్వాయి మండలం, ఉత్తరాన సదాశివనగర్ మండలం మరియు రామారెడ్డి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 106298. ఇందులో పురుషులు 53478, మహిళలు 52820. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 127642. ఇందులో పురుషులు 63098, మహిళలు 64544. పట్టణ జనాభా 80378, గ్రామీణ జనాభా 47264. అక్షరాస్యత శాతం 72.69%. రాజకీయాలు: ఈ మండలము కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2014లో ఎంపీపీగా లద్దూరి మంగమ్మ ఎన్నికయ్యారు. 2019 ప్రకారం మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు కలవు. 2019లో భిక్నూరు ZPTCగా తెరాస పార్టీకి చెందిన రమాదేవి చిదూర ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Adloor, Chinna Mallareddy, Devanpalle, Elichpur, Gargul, Gudem, Isrojiwadi, Kamareddy (U), Kothalpalle, Kyasampalle, Lingapur (R), Lingayapalle, Narasannapalle, Patharajampet, Raghavapur, Rameswarpalle, Sarampalle, Shabdipur, Tekriyal, Thimmakkapalle, Thimmakkapalle, Uggrawai
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అడ్లూర్ (Adlur):అడ్లూర్ కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలమునకు చెందిన గ్రామము. ఇది మేజర్ గ్రామపంచాయతి. గ్రామపంచాయతీల స్థానంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు అడ్లూరు పంచాయతీని తొలిసారిగా ఎన్నికచేశారు. 01-01-2001న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రారంభించారు. ఇల్చీపూర్ (Ilchipur): ఇల్చీపూర్ నిజామాబాదు జిల్లా కామారెడ్డి మండలమునకు చెందిన గ్రామము. నటరాజ రామకృష్ణ శిష్యురాలు, ప్రముఖ నాటకళాకార్ణి జయలక్ష్మి స్వగ్రామం. కామారెడ్డి (Kamareddy): కామారెడ్డి కామారెడ్డి జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఇది పూర్వపు తాలుకా కేంద్రము ఈ పట్టణము 7వ (కొత్త నెంబరు 44) నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాదు నుంచి 100 కిమీ దూరంలో ఉంది. పట్టణంలో ఆల్కహాల్ ప్యాక్టరీ ప్రసిద్ధి చెందినది. నేత వస్త్రములు, అద్దకపు వస్త్రములు తయారౌతాయి. జాతీయ రహదారి ప్రక్కన 1912లో నిర్మించిన అతిథిగృహం ఉంది. ఇందిరాగాంధీకూడా ఇక్కడసేదతీరారు. సమరయోధుడు కుర్రి బాల్‌లింగం, హాస్యనటుడు వెన్నెల కిశోర్ కామారెడ్డికి చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Kamareddy Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి