తాడ్వాయి కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు. 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో తాడ్వాయి మండలంలోని 4 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటుచేసిన రాజంపేట మండలంలో కలిపారు. అదేసమయంలో ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో చేరింది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన సదాశిననగర్ మండలం, తూర్పున కామారెడ్డి మండలం, దక్షిణాన రాజంపేట మండలం, పశ్చిమాన లింగంపేట మండలం, వాయువ్యాన గాంధారి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 48450. ఇందులో పురుషులు 23270, మహిళలు 25180. రాజకీయాలు: ఈ మండలము ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2006లో తాడ్వాయి నుంచి జడ్పీటీసీగా విజయం సాధించిన వెంకటరమణారెడ్డి జడ్పీ చైర్మెన్‌గా పనిచేశారు. 2019 ప్రకారం మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు కలవు. రాజకీయ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Abdullanagar, Brahamajiwadi, Brahmanpalle, Chandapur, Chinna Demi, Chityal, Devaipalle, Endriyal, Kankal, Karadpalle, Kelojiwadi, Krishnajiwadi, Nandiwada, Pedda Demi, Sangojiwadi, Santaipet, Somaram, Tadwai, Venkayalapalle, Yerrapahad
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
తాడ్వాయి (Tadwai):తాడ్వాయి కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలమునకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. వాలీబాల్ క్రీడాకారులకు ఈ గ్రామం ప్రసిద్ధి. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వెళ్ళు రహదారిలో ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Tadvai or Tadwai Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి