సదాశివనగర్ కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు. ఇస్సన్నపల్లి-రామారెడ్డి సరిహద్దులలో కాలభైరవస్వామి ఆలయం ఉంది. 2006లో ఈ మండలం నుంచి జడ్పీటీసిగా ఎన్నికైన గాధారి అనిత జడ్పీ చైర్మెన్‌గా పనిచేశారు. దేశంలో అతిపొడవైన 44వ నెంబరు జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది.
2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో సదాశివనగర్ మండలంలోని 10 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటుచేసిన రామారెడ్డి మండలంలో కలిపారు. అదేసమయంలో ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: సదాశివనగర్ మండలం కామారెడ్డి జిల్లాలో ఉత్తరం వైపున నిజామాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున రామారెడ్డి మండలం, ఆగ్నేయాన కామారెడ్డి మండలం, దక్షిణాన తాడ్వాయి మండలం, పశ్చిమాన గాంధారి మండలం, ఉత్తరాన నిజామాబాదు జిల్లా సరిహద్దుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 56019. ఇందులో పురుషులు 27404, మహిళలు 28615. రాజకీయాలు: సదాశివనగర్ మండలం ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రకారం మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు కలవు. 2006లో జడ్పీటీసిగా ఎన్నికైన గాధారి అనిత జడ్పీ చైర్మెన్‌గా పనిచేశారు. 1967లో కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి పైడి మధుసూధన్ రెడ్డి ఈ మండలమనకు చెందినవారు. 2014లో ఎంపీపీగా బంజ విజయ ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Adloor Yellareddy, Amarlabanda, Bhoompalle, Dhaggi, Dharmaraopet, Jangaon, Kammajiwadi, Kolwaral, Kuprial, Lingampalle, Markhal, Modegaon, Mudhojiwadi, Padmajiwadi, Sadashiva Nagar, Thimmajiwadi, Tirmanpalle, Tukkojiwadi, Uthnoor, Vajjepally (Kalan), Vajjepally(Kurdu), Yacharam
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అడ్లూర్ ఎల్లారెడ్డి (Adlur Ellareddy):అడ్లూర్ ఎల్లారెడ్డి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలమనకు చెందిన గ్రామము. 1978లో కామారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన పైడి మధుసూధన్ రెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. ఇక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1969లో నెలకొల్పబడింది. ఇస్సన్నపల్లి (Isannapally): ఇస్సన్నపల్లి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ కాలభైరవస్వామి ఆలయం ఉంది. దీనిని దోమకొండ సంస్థానాధీశులు నిర్మించారు. దేవాలయంపై గోపురం లేకపోవడం, అశ్వ తీర్థవక్షం ఛాయలో ఉండటం ఎంతో పవిత్రమైంది. ప్రతి ఏటా శ్రీకాళభైరవ స్వామి జన్మదినోత్సవ వేడుకలు ఐదురోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Sadashiv nagar Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి