గాంధారి కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 44 గ్రామపంచాయతీలు, 33 రెవెన్యూ గ్రామాలు కలవు. గండివేట్‌తండాకు చెందిన హన్మంత్ నాయక్ హైదరాబాదు కార్పోరేషన్ డిప్యూటి మేయరుగా పనిచేశారు.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా అవతరించిన కామారెడ్డి జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: గాంధారి మండలం కామారెడ్డి జిల్లాలో ఉత్తరం వైపున నిజామాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున సదాశివనగర్ మండలం, ఆగ్నేయాన తాడ్వాయి మండలం, దక్షిణాన లింగంపేట మండలం, నైరుతిన నిజాంసాగర్ మండలం, పశ్చిమాన బాన్సువాడ మండలం, ఉత్తరాన నిజామాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 58858. ఇందులో పురుషులు 29562, మహిళలు 29306. అక్షరాస్యత శాతం 50.73%. రాజకీయాలు: ఈ మండలము ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు కలవు. 2014లో ఎంపీపీగా యశోధాబాయి ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bangarwadi, Boppajiwadi, Brahmanpalle, Burgul, Chedmal, Chinnapur, Durgam, Gandhari, Gandivet, Gujjul, Gurjal, Juvvadi, Karakwadi, Katewadi, Konaipalle, Madholi, Mathsangam, Medpalle, Naglur, Narsapur (Mudholi), Neral, Pedda Gouraram, Petasangam, Pothangal (Kalan), Pothangal (Khurd), Ramalakshmanpalle, Sarvapur, Sithaipalle, Somaram, Thimmapuram, Tipparam, Vandrikal, Venkatapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గండివేట్‌తాండ (Gandipet Tanda):గండివేట్‌తాండ కామారెడ్డి జిల్లా గాంధారి మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన హన్మంత్ నాయక్ హైదరాబాదు కార్పోరేషన్ డిప్యూటి మేయరుగా పనిచేశారు. 1986లో కార్పోరేటరుగా ఎన్నికై 1988-91 వరకు డిప్యూటి మేయరుగా పదవిలో ఉన్నారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Gandhari Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి