1, జూన్ 2019, శనివారం

సుందర్‌లాల్ బహుగుణ (Sunderlal Bahuguna)

జననంజనవరి 9, 1927
రంగంపర్యావరణ ఉద్యమం
గుర్తింపులుపద్మవిభూషణ్, రైట్ లివ్లీహుడ్ అవార్డు, జమన్‌లాల్ బజాజ్ అవార్డు,
మరణం
21-05-2021
భారతదేశపు ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడైన సుందర్‌లాల్ బహుగుణ జనవరి 9, 1927న ఉత్తరాఖండ్‌లోని టెహ్రీగర్వాల్‌లో (మరోడా) జన్మించారు. 1970 దశకంలో హిమాలయాలలో భగీరథి నదిపై నిర్మించతలపెట్టిన టెహ్రీ ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యావరణం దృష్ట్యా వ్యతిరేకించి ప్రసిద్ధిచెందారు. ఇది చిప్కో ఉద్యమంగా పేరుపొందింది. చిప్కోఉద్యమ నాయకుడిగా అడవుల నరికివేతకు వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించారు. ఉత్తరప్రదేశ్‌లో బహుళ ప్రచారం పొందిన ఈ చిప్కో ఉద్యమమే తర్వాతికాలంలో కర్ణాటకలో అప్పికో ఉద్యమానికి ప్రేరేపించింది. వందనాశివ, మేధాపాట్కర్‌లతో కలిసి India's Environment : Myth & Reality పుస్తకాన్ని రచించగా, హిందీలో ధర్తీకా పుకార్ గ్రంథాన్ని రచించారు. మే 21, 2021న బహుగుణ మరణించారు.

గుర్తింపులు:
సుందర్‌లాల్ బహుగుణ చేసిన కృషికి గుర్తింపుగా భారతప్రభుత్వం 1981లో భారతప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది (కాని ఆయన తిరస్కరించారు). 1986లో జమన్‌లాల్ బజాజ్ అవార్డు, 1987లో బహుగుణకు రైట్ లివ్లీహుడ్ అవార్డు లభించింది. 2009లో పద్మవిభూషణ్ పురస్కారం పొందారు.

ఇవి కూడా చూడండి:
  • చిప్కో ఉద్యమం,
  • మేధాపాట్కర్,
  • వందనాశివ,
  • అప్పికో ఉద్యమం,

హోం,
విభాగాలు:
భారతదేశ పర్యావరణవేత్తలు, ఉత్తరాఖండ్ ప్రముఖులు,


 = = = = =


Tags: About Sundarlal Bahuguna Biography,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక