లింగంపేట్ కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలోని గ్రామాలన్నీ పూర్వపు ఎల్లారెడ్డి తాలుకాలోనివి. రాష్ట్ర మంత్రిగా, జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన తాడూర్ బాలాగౌడ్ ఈ మండలమునకు చెందినవారు. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా అవతరించిన కామారెడ్డి జిల్లాలో చేరింది.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా లింగంపేట మండలం కామారెడ్డి జిల్లాలో దాదాపు మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన గాంధారి మండలం, తూర్పున తాడ్వాయి మండలం, దక్షిణాన నాగిరెడ్డిపేట మండలం, పశ్చిమాన ఎల్లారెడ్డి మండలం, ఆగ్నేయాన మెదక్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 43904. ఇందులో పురుషులు 21528, మహిళలు 22376. గృహాల సంఖ్య 8831. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 48961. ఇందులో పురుషులు 23847, మహిళలు 25114. అక్షరాస్యత శాతం 48.39%. ఇది జిల్లాలో అత్యల్ప అక్షరాస్యత శాతం కల మండలంగా నిల్చింది. రాజకీయాలు: ఈ మండలము ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు కలవు. 2014లో ఎంపీపీగా ఆసియాబేగం ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Banapur, Bayampalle, Bhavanipet, Bonal, Jaldipalle, Kanchmahal, Kannapur, Kondapur, Korpole, Lingampalle (Khurd, Lingampet, Mangaram, Mombajipet, Motha, Nagaram, Nallamadugu, Perumalla, Polkampet, Pothaipalle, Rampur, Shatpalle, Shetpalle, Yellaram,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఐలాపురం (Ilapuram):ఐలాపురం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ రాజకీయ నాయకుడు బాలాగౌడ్ ఈ గ్రామానికి చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Lingampet Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి