తుంగతుర్తి సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు, 17 గ్రామపంచాయతీలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 57975. ఈ మండాలానికి (కొత్తగూడెం, పస్తాల గ్రామాలకు) ఏటా సైబీరియా పక్షులు వస్తాయి. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఆకారపు సుదర్శన్ మండలంలోని బండరామారం గ్రామానికి చెందినవారు.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం నల్గొండ జిల్లా నుంచి కొత్తగా అవతరించిన సూర్యాపేట జిల్లాలోకి మారింది. అదేసమయంలో మండలంలోని 3 గ్రామాలను కొత్తగా అవతరించిన నాగారం మండలంలో, 5 గ్రామాలను మద్దిరాల మండలంలో విలీనం చేశారు. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా తుంగతుర్తి మండలం సూర్యాపేట జిల్లాలో ఉత్తరం వైపున మహబూబాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున మద్దిరాల మండలం, ఆగ్నేయాన నూతన్‌కల్ మండలం, దక్షిణాన జాజిరెడ్డి గూడెం మండలం, పశ్చిమాన నాగారం మండలం మరియు తిరుమలగిరి మండలం, ఉత్తరాన మహబూబాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 52922, 2011 నాటికి జనాభా 5053 పెరిగి 57975 కు పెరిగింది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 57975. ఇందులో పురుషులు 28787, మహిళలు 29188. రాజకీయాలు: ఈ మండలము తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. తుంగతుర్తి ఎంపిపిగా, సూర్యాపేట ఎమ్మెల్యేగా (1989, 1994), తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన ఆకారపు సుదర్శన్ ఈ మండలానికి చెందినవారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Annaram, Banda Ramaram, Ganugu Banda, Gottiparthy, Karvirala, Keshava Poor, Manapur, Ravulapally, Sangam, Thungathurthy, Velugupally, Vempaty
ప్రముఖ గ్రామాలు
బండరామారం (Banda ramaram): బండరామారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలమునకు చెందిన గ్రామము. తుంగతుర్తి ఎంపిపిగా, సూర్యాపేట ఎమ్మెల్యేగా (1989, 1994), తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన ఆకారపు సుదర్శన్ ఈ గ్రామానికి చెందినవారు. జూలై 20, 2011న మరణించారు. వెలుగుపల్లి (Velugupalli): వెలుగుపల్లి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన గ్రామము. గ్రామపరిధిలో రుద్రమ్మ చెరువు ఉంది. 243 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కింద 800 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Thungaturthy Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి