ఎడపల్లి నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో అలీసాగర్ పర్యాటక ప్రాంతం ఉంది. మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ ఈ మండలమునకు చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన రేంజల్ మండలం, ఈశాన్యాన నవీపేట మండలం, తూర్పున మరియు దక్షిణాన నిజామాబాదు గ్రామీణ మండలం, నైరుతిన వర్ని మండలం, పశ్చిమాన బోధన్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 39832. ఇందులో పురుషులు 19352, మహిళలు 20480. రాజకీయాలు: ఈ మండలము బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019లో ఎడపల్లి జడ్పీటీసిగా ఎన్నికైన రజిత నిజామాబాదు జిల్లా జడ్పీ వైస్ చైర్మెన్ పదవి పొందారు. 2019 ప్రకారం మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ambam, Brahammanpally, Ibrahimpur, Jaithapur, Jamlam, Jankampet, Kurnapally, Mallepahad, Mangalpahad, Pocharam, Thanekalan, Yedpalle
ప్రముఖ గ్రామాలు
జానకంపేట (Janakampet): జానకంపేట నిజామాబాదు జిల్లా ఎడపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఆలయం ప్రాంగణంలో దేశంలోనే రెండో అష్టముఖి కోనేరు ఉంది. మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పోచారం (Pocharam): పోచారం నిజామాబాదు జిల్లా ఎడవెల్లి మండలమునకు చెందిన గ్రామము. బోధన్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన బషీరుద్దీన్ బాబూఖాన్ ఈ గ్రామానికి చెందినవారు. ఎడపల్లి (Yedapalli): ఎడపల్లి నిజామాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. 2014లో ఎడపల్లి-1 నుంచి ఎంపీటీసిగా ఎన్నికైన రజిత ఎంపిపి పదవి పొందగా, 2014లో ఎడపల్లి జడ్పీటీసిగా ఎన్నికై నిజామాబాదు జడ్పీ వైస్ చైర్మెన్ పదవి పొందారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Yedapalli Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి