రేంజల్ నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు కలవు. గోదావరి నది తెలంగాణలో ఈ మండలంలోనే ప్రవేశిస్తుంది. త్రివేణిక్షేత్రంగా పేరుపొందిన కందకుర్తి ఈ మండలంలో ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: రేంజల్ మండలం నిజామాబాదు జిల్లాలో ఉత్తరం వైపున నిర్మల్ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున నవీపేట్ మండలం, దక్షిణాన ఎడపల్లి మండలం, పశ్చిమాన బోధన్ మండలం, ఉత్తరాన నిర్మల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38898. ఇందులో పురుషులు 19160, మహిళలు 19738. రాజకీయాలు: ఈ మండలం బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bhagepally, Boregaon, Dupalli, Kalyapur, Kandakurthi, Kunepally, Neela, Ranjal, Satapur, Tadbiloli
ప్రముఖ గ్రామాలు
కందకుర్తి (kandakurthy): కందకుర్తి నిజామాబాదు జిల్లా రేంజల్ మండలమునకు చెందిన గ్రామము. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ పూర్వీకులు ఈ గ్రామానికి చెందినవారు. గోదావరి నది తెలంగాణలో ప్రవేశించు ప్రాంతంగా ఇది ప్రసిద్ధి చెందింది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఇక్కడ ఘాట్ చేర్పాటుచేశారు. ఇది త్రివేణిక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తాడ్‌బిరోలి (Tadbiroli): తాడ్బిరోలి నిజామాబాదు జిల్లా రేంజల్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం గోదావరి నది తీరాన ఉంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో శివాలయం మరియు హనుమాన్ ఆలయం వద్ద పుష్కర ఘాట్ ఏర్పాటుచేశారు. అలీసాగర్ ఎత్తిపోతలకు చెందిన రెండో పంప్‌హౌస్ తాడ్‌బిరోలిలో ఏర్పాటుచేశారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Renjal or Ranjal Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి