12, జులై 2019, శుక్రవారం

బాలగంగాధర తిలక్ (Bal Gangadhar Tilak)


జననంజూలై 23, 1856
జన్మస్థానంరత్నగిరి
బిరుదు లోకమాన్య
పత్రికలుమరాఠా, కేసరి
మరణంఆగస్టు 1, 1920
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడైన బాలగంగాధర తిలక్ జూలై 23, 1856న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు. జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించి భారతజాతీయోద్యమ పితగా పేరుపొందారు. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి బ్రిటీష్ ప్రభుత్వ అశాంతికి కారకుడైనందున ఈయన్ను అశాంతి పితామహుడు అని కూడా పిలుస్తారు. తిలక్‌కు లోకమాన్య అనే బిరుదు ఉంది. స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను అనే ఈయన నినాదం సుప్రసిద్ధమైనది. మరాఠా(ఆంగ్ల పత్రిక), కేసరి(మరాఠీ పత్రిక) పత్రికలను నడిపి జాతీయోద్యమాన్ని ప్రచారం చేశారు.

తిలక్ 1890లో భారత జాతీయ కాంగ్రెస్ లో సభ్యుడుగా చేరారు. కాని కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం లేదు. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని ఆయన నమ్మి మితవాదులపై ఘాటైన విమర్శలు చేశాడు: "మీరు సంవత్సరానికొకసారి సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు. అన్నారు. కాంగ్రెస్ సంస్థను అడుక్కునేవాళ్ళ సంఘం అని విమర్శించారు. 1907లో మహారాష్ట్రలోని సూరత్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్, ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. 1916 ఏప్రిల్ లో హోంరూల్ లీగ్‌ను స్థాపించి ప్రచార్ం చేశారు. ఆగస్టు 1, 1920న తిలక్ ముంబాయిలో మరణించారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: భారత స్వాతంత్ర్య సమరయోధులు, మహారాష్ట్ర ప్రముఖులు, భారతదేశ ప్రముఖులు,


 = = = = =


Tags: about Bal gangadhar tilak, Tilak Jeevitha Charitra, Home rule, biography of Balgangadhar Tilak in telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక