18, జులై 2019, గురువారం

బిపిన్ చంద్ర పాల్ (Bipin Chandra Pal)


జననంనవంబరు 7, 1858
జన్మస్థానంసిల్హెట్ జిల్లా
రంగంస్వాతంత్ర్య సమరయోధుడు
మరణంమే 20, 1932
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సామాజిక సేవకుడిగా, రచయితగా పేరుపొందిన బిపిన్ చంద్ర పాల్ నవంబరు 7, 1858న ఇప్పటి బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ జిల్లాలో జన్మించాడు. జాతీయోద్యమ చరిత్రలో లాల్ బాల్ పాల్ త్రయంగా పేరుపొందిన ముగ్గురిలో ఈయన ఒకరు. 1905 లో బెంగాల్ విభజన సమయంలో బ్రిటీష్ వారిపై పోరాటంలో ప్రసిద్ధిచెందాడు. జాతీయోద్యమ పత్రిక వందేమాతరంను ప్రారంభించి తన పత్రికలో స్వాతంత్ర్య భావాలు కల్పించి ఎందరో సమరయోధులను ఉత్తేజితులను చేసాడు.

అతివాదభావాలు కల్గిన పాల్ పలుదశలలో మహాత్మాగాంధీ సిద్ధాంతాలను వ్యతిరేకించాడు. బ్రహ్మ సమాజంలో సభ్యుడైన పాల్ బ్రహ్మసమాజ సిద్ధాంతాలను ప్రచారం చేయడమే కాకుండా స్వయంగా ఒక వితంతువును వివాహమాడి ఆదర్శంగా నిలిచాడు. పూర్ణస్వరాజ్, స్వదేశీ ఉద్యమం, జాతీయ విద్య తదితర విషయాలలో ఈయన పాత్ర చాలా ఉంది.  మే 20, 1932న 73 సం.ల వయస్సులో బిపిన్ చంద్రపాల్ మరణించాడు. ఈయన కుమారుడు నిరంజన్ పాల్ బాంబేటాకీస్ స్థాపకుల్లో ఒకరు. అల్లుడు ఎస్.కె.డే కేంద్రమంత్రిగా పనిచేశారు.
హోం
విభాగాలు: భారత స్వాతంత్ర్య సమరయోధులు, బెంగాల్ ప్రముఖులు, భారతదేశ ప్రముఖులు,


 = = = = =


Tags: about Bipin Chandra Pal, biography of Bipin Chandra Pal in telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక