బాసర నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు ముధోల్ మండలంలో ఉన్న 17 రెవెన్యూ గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలం దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 10 గ్రామపంచాయతీలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు..
భౌగోళికం, సరిహద్దులు: బాసర మండలం నిర్మల్ జిల్లాలో అతి దక్షిణాన నిజామాబాదు జిల్లా మరియు మహారాష్ట్రల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన ముధోల్ మండలం, వాయువ్యాన తానూర్ మండలం, తూర్పున మరియు దక్షిణాన నిజామాబాదు జిల్లా, పశ్చిమాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వం ఈ మండలం నాందేడ్ జిల్లాలో భాగంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం ముధోల్ తాలుకాగా మారింది. 1986లో మండలంగా ఏర్పడింది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. రాజకీయాలు: ఈ మండలం ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
బాసర మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Basar, Bidrelli, Dhondapur, Kirgul (Buzurg), Kirgul (Khurd), Kowtha, Labdi, Mahadpur, Mailapur, Ratnapur, Ravindrapur, Renukapur, Salapur, Sawargaon, Surli, Takli, Voni
ప్రముఖ గ్రామాలు
బాసర (Basara): బాసర నిర్మల్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందిన శ్రీసరస్వతీ దేవాలయం బాసరలో ఉంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో సహ్యాద్రి పర్వతాల దిగువన నిజామాబాదు జిల్లా, మహారాష్ట్రల సరిహద్దులో గోదావరి నది తీరాన బాసర క్షేత్రం కేంద్రీకృతమై ఉంది. సికింద్రాబాదు- నాందేడ్ మార్గంలో బాసర రైల్వేస్టేషన్ ఉంది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Basar Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి