భీంగల్ నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 16 గ్రామపంచాయతీలు, 24 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో గ్రానైట్ గనులున్నాయి. నింబాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన లింబాద్రి గుట్ట ఈ మండలంలోనే ఉంది. క్రీ.శ.16వ శతాబ్దికి చెందిన ప్రముఖ కవి, సింహాసన ద్వాత్రింశిక రచయిత అయిన కొరవి గోపరాజు భీంగల్ ప్రాంతానికి చెందినవాడు.
భౌగోళికం, సరిహద్దులు: భీంగల్ మండలం నిజామాబాదు జిల్లాలో తూర్పువైపున రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి వెల్పూర్ మండలం మరియు కమ్మర్‌పల్లి మండలం, దక్షిణాన సిరికొండ మండలం, పశ్చిమాన జక్రాన్‌పల్లి మండలం తూర్పున రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 62703. ఇందులో పురుషులు 30605, మహిళలు 32098. రాజకీయాలు: ఈ మండలము బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు కలవు.
భీంగల్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Babanagar, Babapur, Bachanpally, Bejjora, Bheemgal, Changal, Devakkapet, Devan Pally, Gangarai, Gongappul, Jagriyal, Karepally, Kupkal, Lingapurchouth, Mendhora, Muchkur, Pallikonda, Pedda Bheemgal, Pipri, Puranipet, Rahathnagar, Salampur, Sikandrapur, Thallapally
ప్రముఖ గ్రామాలు
భీంగల్ (Bheemgal): భీంగల్ నిజామాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. మండల వ్యవస్థకు ముందు ఇది తాలుకా కేంద్రంగా ఉండేది. గ్రామంలో క్రీ.శ.10వ శతాబ్దిలో బోధన్ చాళుక్యరాజు రెండో అరికేసరిచే నిర్మించబడిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది.
లింగాపూర్ చౌత్ (Lingapur Chowth):
లింగాపూర్ చౌత్ నిజామాబాదు జిల్లా భీంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ వీర హన్మాండ్లు ఆలయం ఉంది. ఇక్కడి మూలవిరాట్టు కొండగట్టులోని స్వామి వారి విగ్రహంలా ఉంటుంది. ఆలయం 2 శతాబ్దాల క్రితం నిర్మించబడింది .
మెండోరా (Mendora):
మెండోరా నిజామాబాదు జిల్లా భీంగల్ మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో గ్రానైట్ నిక్షేపాలున్నాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bheemgal Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి