వేల్పూర్ నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలోని పడగల్‌లో పసుపు పార్క్ ఏర్పాటుచేస్తున్నారు. మండలం మీదుగా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయరహదారి (నెంబర్ 16) వెళ్ళుచున్నది. అక్టోబరు 11, 2016న మోర్తాడ్ మండలంలోని రామన్నపేట గ్రామాన్ని ఈ మండలంలో కలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్, 2019లో రాష్ట్రమంత్రిగా స్థానం పొందిన వేముల ప్రశాంత్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 100% వాలకార్మికుల నిర్మూలనలో వేల్పూర్ మండలం జాతీయస్థాయిలో ప్రత్యేకస్థానం పొందింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన బాల్కొండ మండలం, తూర్పున మోర్తాడ్ మండలం, దక్షిణాన భీంగల్ మండలం, పశ్చిమాన జక్రాన్‌పల్లి మండలం మరియు ఆర్మూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42414. ఇందులో పురుషులు 20609, మహిళలు 21805. రాజకీయాలు: ఈ మండలము బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు కలవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ ఈ మండలమునకు చెందినవారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Aklur, Ameenapur, Anksapur, Janakampeta, Komanpalle, Kothapalle, Kuknur, Lakhora, Mothe, Narkhoda, Padgal, Pochampalle, Ramannapet, Sahebpet, Velpur, Venkatapur, Wadi
ప్రముఖ గ్రామాలు
అంక్సాపూర్ (Anksapur): అంక్సాపూర్ నిజామాబాదు జిల్లా వేల్పూరు మండలమునకు చెందిన గ్రామము. అంక్సాపూర్‌లో ఏటా సంతమల్లన్న జాతర జరుగుతుంది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. 1999లో భాజపా తరఫున మెట్‌పల్లి నుంచి విజయం సాధించిన వెంకటరమణారెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. జాన్కంపేట (Jankampet): జాన్కంపేట నిజామాబాదు జిల్లా వేల్పూరు మండలమునకు చెందిన గ్రామము. భాజపా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పెద్దొల్ల గంగారెడ్డి, జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ జనరల్ మేనెజరుగా పనిచేసిన పద్మారావు ఈ గ్రామానికి చెందినవారు. 1969 తెలంగాణ రాష్ట్రసాధన కోసం అమరురులైన 369 మంది ప్రాణత్యాగానికి గుర్తుగా 2000లో ఈ గ్రామంలో అతిపెద్ద అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. కోమన్‌పల్లి (Komanpally):
కోమన్‌పల్లి నిజామాబాదు జిల్లా వేల్పూరు మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన ర్యాడా మహేష్ సైన్యంలో పనిచేస్తూ నవంబరు 2020లో వీరమరణం పొందాడు. లక్కోర (Lakkora): లక్కోర నిజామాబాదు జిల్లా వేల్పూరు మండలమునకు చెందిన గ్రామము. 2011 ఏప్రిల్ 27న గ్రామసమీపంలో పెళ్ళిబృదం లారీ బోల్తాపడి 12 మంది మరణించారు. మోతె (Mothe): మోతె నిజామాబాదు జిల్లా వేల్పురు మండలమునకు చెందిన గ్రామము. 2001లో ఈ గ్రామంలో గ్రామస్థులు తీసుకున్న నిర్ణయం తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చింది. 2001, మే4న కేసిఆర్ ఈ గ్రామానికి వచ్చి మట్టిని తీసుకొని ముడుపు కట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఈ ముడుపును విప్పుతానని బహిరంగ సభలో శపథం చేశారు. మాట ప్రకారం 2014, మార్చి 28న కేసిఆర్ ఈ గ్రామానికి వచ్చి ముడుపు విప్పారు. వేల్పూరు (Velpur) వేల్పూరు నిజామాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అభివృద్ధికై గ్రామపంచాయతీకి స్వశక్తికరణ్ అవార్డు లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్, రాష్ట్రమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ గ్రామానికి చెందినవారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Velpur or Vailpur Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి