(ఆదిలాబాదు జిల్లా సిరికొండ మండల వ్యాసం కోసం ఇక్కడ చూడండి) సిరికొండ నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 30 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పిన్న వయస్కురాలు మలావత్ పూర్ణ ఈ మండలమునకు చెందినది. అక్టోబరు 11, 2016న ఈ మండలంలోని 3 గ్రామాలను ధర్పల్లి మండలంలో కలిపారు. ప్రస్తుతం మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా సిరికొండ మండలం నిజామాబాదు జిల్లాలో ఆగ్నేయాన కామారెడ్డి జిల్లా మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన భీంగల్ మండలం, పశ్చిమాన ధర్పల్లి మండలం, తూర్పున రాజన్న సిరిసిల్ల జిల్లా, దక్షిణాన కామారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51109. ఇందులో పురుషులు 24815, మహిళలు 26294. రాజకీయాలు: ఈ మండలము నిజామాబాదు (గ్రామీణ) అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Chimanpalli, Chinna Walgot, Gadkole, Gargepahad, Hussainnagar, Kondapur, Kondur, Mailaram, Musheernagar, Nyavandi, Pakhal, Pandimadugu, Pedda Walgot, Pothnur, Ramadugu, Ravutla, Sirkonda, Thatpalli, Thumpalli
ప్రముఖ గ్రామాలు
పాకాల (Pakala): పాకాల నిజామాబాదు జిల్లా సిరికొండ మండలమునకు చెందిన గ్రామము. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పిన్న వయస్కురాలు మలావత్ పూర్ణ ఈ గ్రామమునకు చెందినది. ముషీర్‌నగర్ (Musheernagar): ముషీర్‌నగర్ నిజామాబాదు జిల్లా సిరికొండ మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో జగదాంబ దేవాలయం ఉంది. తాటిపల్లి (Tatipaly): తాటిపల్లి నిజామాబాదు జిల్లా సిరికొండ మండలమునకు చెందిన గ్రామము. ప్రమాణాల దేవుడిగా భాసిల్లుచున్న ఆంజనేయస్వామి ఆలయం ఉంది. తప్పుడు ప్రమాణం చేస్తే దేవుడు శిక్షిస్తాడని గ్రామస్థులు నమ్ముతారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Sirikonda Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి