జక్రాన్ పల్లి నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. మంత్రిగా పనిచేసిన గడ్డం రాజారాం, లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన గడ్డం గంగారెడ్డి ఈ మండలానికి చెందినవారు. 44వ నెంబరు జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా జక్రాన్‌పల్లి మండలం నిజామాబాదు జిల్లాలో దాదాపు మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన ఆర్మూర్ మండలం, తూర్పున వేల్పూర్ మండలం, దక్షిణాన డిచ్‌పల్లి మండలం, పశ్చిమాన మాక్లూర్ మండలం, ఆగ్నేయాన భీంగల్ మండలం, ధర్పల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 45528. ఇందులో పురుషులు 22032, మహిళలు 23496. రాజకీయాలు: ఈ మండలము నిజామాబాదు (గ్రామీణ) అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Argul, Brahmanpally, Chintalur, Jakranpally, Kaligote, Keshpally, Kolipaka, Lakshmapur, Madhapur, Manoharabad, Munpally, Narayanpet, Padkal, Poppalpally, Sikindrapur, Thorlikonda
ప్రముఖ గ్రామాలు
కలిగోట్ (Kaligot): కలిగోట్ నిజామాబాదు జిల్లా జక్రాన్‌పల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ ఖండేరావు స్వామి గుడి ఉంది. ఏటా జాతర నిర్వహిస్తారు. కేశ్‌పల్లి (Keshpally): కేశ్‌పల్లి నిజామాబాదు జిల్లా జక్రాన్‌పల్లి మండలమునకు చెందిన గ్రామము. 14వ శతాబ్దంలో కాకతీయులు పాలించిన ఆనవాళ్ళు గ్రామంలో ఉన్నాయి. రెండో ప్రతాపరుద్రదేవుని కాలంలో నిర్మించిన రాతి కట్టడాలు ఉన్నాయి. కేశ్‌పల్లి సమీపంలో కేశ్వనాథాలయం ఉంది. మునిపల్లె (Munipalli): మునిపల్లె నిజామాబాదు జిల్లా జక్రాన్‌పల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇది మునిపల్లె చారిత్రక గ్రామం. శంభుని కొండపై 200 సంల నాటి శివాలయం ఉంది. మునీశ్వరులు నడియాడిన పల్లెగా ఘనత పొందిన ఈ గ్రామం నిజాంల కాలం వరకు మునీశ్వరులపల్లెగా పేరు ఉండేది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
jakranpalli or Jakranpally Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి