ముప్కాల్ నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు బాల్కొండ మండలంలో ఉన్న 7 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 7 గ్రామపంచాయతీలు, 7 రెవెన్యూ గ్రామాలు కలవు. ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, తీన్మార్ సావిత్రిగా ప్రసిద్ధి చెందిన జ్యోతి ఈ మండలంనకు చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలమునకు ఉత్తరాన మెండోరా మండలం, తూర్పున ఎర్గట్ల మండలం, దక్షిణాన బాల్కొండ మండలం, ఆగ్నేయాన మోర్తాడ్ మండలం, పశ్చిమాన నందిపేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు కలవు.
ముప్కాల్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Kothapally, Mupkal, Nagampet, Nallur, Renjarla, Vempally, Venchiryal
ప్రముఖ గ్రామాలు
నాగంపేట (Nagampet): నాగంపేట నిజామాబాదు జిల్లా ముప్కాల్ మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, తీన్మార్ సావిత్రిగా ప్రసిద్ధి చెందిన జ్యోతి ఈ గ్రామంనకు చెందినవారు. ముప్కాల్ (Mupkal): ముప్కాల్ నిజామాబాదు జిల్లా కు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అక్టోబరు 11, 2016న ఈ గ్రామం మండల కేంద్రంగా మారింది. అంతకుక్రితం బాల్కొండ మండలంలో ఉండేది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mupkal Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి