4, ఆగస్టు 2019, ఆదివారం

దాదాభాయి నౌరోజి (Dadabhai Naoroji)


జననంసెప్టెంబరు 4, 1825
జన్మస్థానంనవసారి
రంగంస్వాతంత్ర్య సమరయోధుడు
మరణంజూన్ 30, 1917
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిల్వబడే దాదాబాయి నౌరోజి సెప్టెంబరు 4, 1825న నవసారిలో జన్మించాడు. ఈయన వ్యాపారవేత్తగానూ, విద్యావేత్తగానూ, రాజకీయనాయకుడిగానూ, సామాజిక సేవకుడిగానూ పేరుపొందాడు. 1892లో బ్రిటన్ కామన్స్ సభకు ఎన్నికై ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా ప్రసిద్ధి చెందాడు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో కూడా ఈయన పాత్ర ఉంది. బ్రిటీష్ కాలంలో ఆంగ్లేయులు భారత్ నుంచి తరలించే సంప్దను Poverty and Un-British Rule in India పేరుతో గ్రంథస్తం చేసి ఆంగ్లేయుల అరాజకాలను బయటపెట్టాడు. జూన్ 30, 1917న నౌరోజి ముంబాయిలో మరణించాడు. స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం 1963, 1997 and 2017లలో ఈయా ముఖచిత్రంతో తపాలాబిళ్ళలను విడుదల చేసి ఈయన సేవలను గుర్తించింది.

గుజరాతి మాతృభాష కల పార్శీ కుటుంబంలో జన్మించిన నౌరోజీ బరోడా మహారాజు శయాజీరావ్ గైక్వాడ్-3 కాలంలో దీవాన్ పదవి పొందాడు. 1855లో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా పదవి చేపట్టాడు. 1859లో స్వయంగా పత్తి వ్యాపారంలో ప్రవేశించాడు. ఆ తర్వాత లండన్ విశ్వవిద్యాలయంలో గుజరాతి ప్రొఫెసర్‌గా చేరాడు. లండన్‌లో ఉన్నప్పుడే భారతదేశ రాజకీయాలు, సమస్యలను చర్చించడానికి 1865లో లండన్ ఇండియా సొసైటి స్థాపించాడు. ఆ తర్వాత లిబరల్ పార్టీ తరఫున బ్రిటీష్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై భారతదేశ సమస్యలపై బ్రిటీష్ పార్లమెంటులో ప్రస్తావించాడు. ఆ తర్వాత భారత్ వచ్చి జాతీయోద్యమంలో పాలుపంచుకున్నాడు. 1886లో రెండో భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షత వహించమే కాకుండా 1893, 1906లలో కూడా కాంగ్రెస్ సభలకు అధ్యక్షత వహించాడు.
హోం
విభాగాలు: భారత స్వాతంత్ర్య సమరయోధులు, భారతదేశ ప్రముఖులు,భారత జాతీయ కాంగ్రెస్,


 = = = = =


Tags: about Dadabhai Naoroji, biography of Dadabhai Naoroji in telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక