ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, లాల్‌బాల్‌పాల్ త్రయంలో ఒకడిగా పేరుపొందిన లాలా లజపతిరాయ్ జనవరి 28, 1865న పంజాబ్‌లోని ధుడికెలో జన్మించారు. లాహోర్‌లో న్యాయవిద్య అభ్యసిస్తున్నప్పుడు స్వాతంత్ర్యోద్యమం వైపు దృష్టిసారించారు. అదేసమయంలో స్వామి దయానంద సరస్వతి భావాలవైపు మొగ్గుచూపారు. 1877లో లాగోర్ ఆర్యసమాజ్ సభ్యుడిగా ఉంటూనే ఆర్యగెజిట్‌కు సంపాదకత్వం వహించారు. ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రవేశించి 1920లో కలకత్తాలో జరిగిన ప్రత్యేక సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైనారు. 1921లో సర్వెంట్స్ ఆఫ్ పీపిల్స్ సొసైటి పేరుతో స్వచ్ఛందసంస్థను నెలకొల్పారు. జాతీయోద్యమంలో పంజాబ్ కేసరిగా పేరుపొందారు.
1928లో సైమన్ కమీషన్ భారత్ వచ్చినప్పుడు అందులో భారతీయులెవరూ సభ్యులుగా లేనందున సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా బాయ్‌కాట్ ఉద్యమాలు జరిగాయి. అక్టోబరు 30, 1928లో సైమన్ కమీషన్ లాహోర్ వచ్చినప్పుడు లాలా లజపతిరాయ్ సైమన్ కమీషన్ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించి సైమన్ గో బ్యాక్ అని నినదించాడు. పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ స్కాత్ ఆదేశాలతో జరిగిన లాఠీచార్జీలో లజపతిరాయ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆ గాయాలతోనే నవంబరు 17, 1928న లజపతిరాయ్ ప్రాణాలు కోల్పోయారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
4, ఆగస్టు 2019, ఆదివారం
లాలా లజపతిరాయ్ (Lala Lajpat Rai)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి