మామడ నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 27 గ్రామపంచాయతీలు, 33 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది, మండలం గుండా శ్రీరాంసాగర్ యొక్క సరస్వతీ కాలువ ప్రవహిస్తున్నాయి.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున పెంబి మండలం మరియు ఖానాపూర్ మండలం, పశ్చిమాన నిర్మల్ గ్రామీణ మండలం మరియు ఉత్తరాన ఆదిలాబాదు జిల్లా, దక్షిణాన నిజామాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 28921. ఇందులో పురుషులు 14059 మరియు స్త్రీలు 14862. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 32471. ఇందులో పురుషులు 15702, మహిళలు 16769. రాజకీయాలు: లక్ష్మణ్‌చాందా మండలం నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
మామడ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Adarsanagar (R.C) Kothur @ Edudur, Ananthpet, Arepalle, Bandal Khanapur, Burugupalle, Chandaram, Danthapalle, Devathapur, Dimmadurthy, Gayadpalle, Kamal Kote, Kappanpalle, Kishanraopet, Koratikal, Kotha Lingampalle (R.C), Kotha Sangvi (R.C), Kotha Timbareni (R.C), Lachampur, Lingapur, Lonkapad, Mamda, Mondepalle, Naldurthi, Parimandal, Ponkal, Potharam, Pulimadugu, Raidhari, Rampur, Rasimatla, Tandra, Vasthapur, Venkatapur
ప్రముఖ గ్రామాలు
కమల్‌కోట్ (Kamalkot): కమల్‌కోట్ నిర్మల్ జిల్లా మామడ మండలమునకు చెందిన గ్రామము. ఇది గోదావరి తీరాన ఉన్నది. నది దాటితే నిజామాబాదు జిల్లా వస్తుంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఇక్కడి బ్రిడి వద్ద పుష్కరఘాట్ ఏర్పాటుచేశారు. పొనకల్ (Ponakal): పొనకల్ నిర్మల్ జిల్లా మామడ మండలమునకు చెందిన గ్రామము. మండలంలోని పెద్ద గ్రామాలలో ఇది ఒకటి. ఇది చాలా పురాతనమైనది. శిథిలావస్థలో ఉన్న గడీలు, బురుజులున్నాయి. 2015 గోదావరి పుష్కరాల సమయంలో నాగులమ్మ ఆలయం వద్ద పుష్కరఘాట్ ఏర్పాటుచేశారు. పోతారం (Potaram): పోతారం నిర్మల్ జిల్లా మామడ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ పెద్దభీమన్న జాతర జరుగుతుంది. పెద్దభీమన్న విగ్రహాలను కొండ నుంచి తెచ్చి గ్రామంలో ఊరేగించడంతో జాతర ప్రారంభమౌతుంది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mamada Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి