లక్ష్మణ్‌చాందా నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలానికి దక్షిణ సరిహద్దుగా గోదావరి నది ప్రవహిస్తుంది. మండలం గుండా శ్రీరాంసాగర్ యొక్క సరస్వతీ కాలువ వెలుతుంది. ఈ మండలము నిర్మల్ రెవెన్యూ డివిజన్, నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు తూర్పున మామడ మండలం, పశ్చిమాన నిర్మల్ గ్రామీణ మండలం మరియు సోన్ మండలం, దక్షిణాన గోదావరి నది దానికి ఆవల నిజామాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 34068. ఇందులో పురుషులు 16521, మహిళలు 17547. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 36658. ఇందులో పురుషులు 17536, మహిళలు 19122. రాజకీయాలు: లక్ష్మణ్‌చాందా మండలం నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
సోన్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Babapur, Boregaon, Chamanpalli, Chinthalchanda, Dharmaram, Kanakpur, Kanjar, Laxmanchanda, Machapur, Mallapur, Munipalli, Narsapur, Parpalli, Peechara, Potpalli B, Potpalli K, Thirpalli, Wadyal
ప్రముఖ గ్రామాలు
బాబాపుర్ (Babapur): బాబాపూర్ నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చాందా మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ ఉన్న రాజరాజేశ్వర దేవాలయం చాలా ప్రాచీనమైనది. కనకాపూర్ (Kanakapur): కనకాపూర్ నిర్మల్ జిల్లా లక్ష్మన్ చందా మండలానికి చెందిన గ్రామము. కనకాపూర్ పంచాయతికి 2008లో నిర్మల్ పురస్కారం లభించింది. లక్ష్మణ్‌చాందా (Laxmanchanda): లక్ష్మణ్‌చాందా ఆదిలాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. పార్‌పల్లి (Parpally): పార్‌పల్లి ఆదిలాబాదు జిల్లా లక్ష్మణ్‌చాందా మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామంలో పదవీవిరమణ పొందిన సైనికులు అధికంగా ఉన్నారు. ఇక్కడ కూలిన కోటలు, బురుజులు ఉన్నాయి. పీచర (Peechara): పీచర ఆదిలాబాదు జిల్లా లక్ష్మణ్‌చాంద మండలమునకు చెందిన గ్రామము. 2015 గోదావరి పుష్కరాల సమయంలో పీచర హనుమాన్ దేవాలయం వద్ద పుష్కరఘాట్ ఏర్పాటుచేశారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Laxmanchanda Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి