18, సెప్టెంబర్ 2019, బుధవారం

గుప్త సామ్రాజ్యం (Gupta Empire)

పాలనాకాలంక్రీ.శ.320-550
రాజధాని పాటలీపుత్ర
రాజ్యస్థాపకుడుమొదటి చంద్రగుప్తుడు
ప్రముఖుడురెండో చంద్రగుప్తుడు
చివరి పాలకుడువిష్ణుగుప్తుడు
భారతదేశ చరిత్రలోనే స్వర్ణయుగంగా పివబడే గుప్తసామ్రాజ్యం క్రీ.శ.320 నుంచి క్రీ.శ.550 వరకు కొనసాగింది. గుప్తవంశ మూలపురుషుడు శ్రీగుప్తుడు కాగా రాజ్య స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. రెండో చంద్రగుప్తుడు గుప్తులలో ప్రముఖుడిగా పరిగణించబడతాడు. విష్ణుగుప్తుని కాలంలో హూణుల దండయాత్రలతో గుప్త సామ్రాజ్యం పతనమైంది.

గుప్తులు తమ సామ్రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. మహాదండనాయకుడు అనే ప్రధాన న్యాయమూర్తి ఉండేవాడు. గుప్తుల కాలంలో ప్రధాన ఆదాయవనరు భూమిశిస్తు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నములు అనబడే 9 మంది కవిపండితులు ఉండేవారు. వీరిలో కాళిదాసు ప్రముఖుడు. ప్రసిద్ధిచెందిన నలందా విశ్వవిద్యాలయం గుప్తుల కాలంలోనే నిర్మితమైంది.

సామ్రాజ్య వ్యాప్తి:
గుప్త సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో ఇప్పటి బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ లోని కొంతభాగం, తూర్పున బంగ్లాదేశ్ వరకు విస్తరించింది. వీరి రాజధాని పాటలీపుత్రము (పాట్నా), రెండో చంద్రగుప్తుని కాలంలో సామ్రాజ్యవ్యాప్తి గరిష్టదశకు చేరింది. రెండో చంద్రగుప్తుని కాలంలో ఇప్పటి ఒడిషా, తూర్పు కోస్తా ప్రాంతాలు కూడా గుప్తుల పాళనలో ఉండేవి.
నలందా విశ్వవిద్యాలయం

గుప్తసామ్రాజ్య పాలకులు:
మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రామగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, మొదటి కుమారగుప్తుడు, స్కందగుప్తుడు, పురుగుప్తుడు, రెండో కుమారగుప్తుడు, బుద్ధగుప్తుడు, నరసింహ(భాను) గుప్తుడు, వైణ్యగుప్తుడు, మూడో కుమారగుప్తుడు, విష్ణుగుప్తుడు.



ఇవి కూడా చూడండి:
  • మౌర్య సామ్రాజ్యం,
  • రెండో చంద్రగుప్తుడు,
  • కాళిదాసు,



హోం
విభాగాలు: భారతదేశ రాజవంశాలు, భారతదేశ చరిత్ర,


 = = = = =


Tags: Gupta Dynasty in Telugu, Indian History Study Material in Telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక