బజార్ హత్నూర్ ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 19° 25' 23'' ఉత్తర అక్షాంశం మరియు 78° 21' 20'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండల పరిధిలోని దేగాం ప్రాంతంలో చిన్నతరహా ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖా మంత్రిగా పనిచేసిన గెడెం రామారావు, మంత్రిగా పనిచేసిన ఆయన కుమారుడు గెడెం రమేష్ ఈ మండలానికి చెందినవారు. కడెం నది జన్మస్థానం, కనకాయి జలపాతం ఈ మండలంలోనే ఉన్నాయి. ఈ మండలంలోని అన్ని గ్రామాలు పూర్వపు బోథ్ తాలుకాలోనివే. ఈ మండలము ఆదిలాబాదు రెవెన్యూ డివిజన్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 30 గ్రామపంచాయతీలు, 31 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: బజార్ హత్నూరు మండలానికి ఉత్తరాన తలమడుగు మండలం, దక్షిణాన బోథ్ మండలం, తూర్పున గుడిహత్నూర్, ఇచ్చోడ మండలం, పశ్చిమాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలో డెడ్రా అటవీప్రాంతం ఉంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 23657. ఇందులో పురుషులు 12079, మహిళలు 11578. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 28414. ఇందులో పురుషులు 14105, మహిళలు 14309. రవాణా సౌకర్యాలు: ఈ మండలానికి రైలు మరియు జాతీయ రహదారి సౌకర్యం లేదు. జాతీయ రహదారిపై ఉన్న ఇచ్చోడ బజార్ హత్నూర్ మండల కేంద్రం నుంచి 15 కిమీ దూరంలో ఉంది. రాజకీయాలు: ఈ మండలము బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
బజార్ హత్నూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బజార్ హత్నూర్ (Bazar Hatnur): బజార్ హత్నూర్ ఆదిలాబాదు జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3767. మండలంలో ఇదే పెద్ద గ్రామము. జాతర్ల (Jatarla): జాతర్ల ఆదిలాబాదు జిల్లా బజార్ హత్నూర్ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1945. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖా మంత్రిగా పనిచేసిన గెడెం రామారావు, మంత్రిగా పనిచేసిన ఆయన కుమారుడు గెడెం రమేష్ ఈ గ్రామానికి చెందినవారు. వీరిద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేసి రాజకీయాలలోకి వచ్చి మంత్రుపదవులు పొందినారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bazar Hatnoor Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి