బోథ్ ఆదిలాబాదు జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము 19° 20' 51'' ఉత్తర అక్షాంశం మరియు 78° 19' 04''
తూర్పు రేఖాంశంపై ఉన్నది. ఈ మండలంలోని అన్ని గ్రామాలు పూర్వపు బోథ్
తాలుకాలోనివే. ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజన్, బోథ్ అసెంబ్లీ
నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. బోథ్ మండలం
జిల్లాలో పశ్చిమం వైపున మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నది. మండలంలో పండించే
ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 33
గ్రామపంచాయతీలు, 39 రెవెన్యూ గ్రామాలు కలవు. పొచ్చెర జలపాతం ఈ మండలంలో
ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: బోథ్ మండలమునకు తూర్పున నేరడిగొండ మండలం, దక్షిణమున నేరడిగొండ మండలం మరియు నిర్మల్ జిల్లా, ఉత్తరాన బజార్ హత్నూర్ మండలం, పశ్చిమాన మరియు వాయువ్యాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42766. ఇందులో పురుషులు 21359, మహిళలు 21407. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 48228. ఇందులో పురుషులు 23618, మహిళలు 24610. రవాణా సౌకర్యాలు: బోథ్ మండలానికి రైలు రవాణా మరియు జాతీయ రహదారి సౌకర్యం లేదు. నేరడిగొండ మండలంలో జాతీయరహదారిపై ఉన్న బోథ్ క్రాస్‌రోడ్ సమీపంలో ఉంది. రాజకీయాలు: ఈ మండలము బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
బోథ్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బోథ్ (Both): బోథ్ ఆదిలాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. 2001 లెక్కల ప్రకారం బోథ్ గ్రామ జనాభా 10737. మండలంలో ఇదే అత్యధిక జనాభా కల గ్రామము. ఇది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రము, పూర్వపు తాలుకా కేంద్రము. ఈ గ్రామము బోధ్, బొంతలగా పిలువబడుతుంది. ఆదిలాబాదు ఊటిగా ప్రసిద్ధి చెందినది. ప్రత్తి ఇక్కడి ముఖ్యమైన పంట. ఈ ప్రాంతంగా మహారాష్ట్ర ప్రభావం అధికంగా ఉంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గుండేరావు ఈ గ్రామానికి చెందినవారు. 2007 స్వాతంత్ర్య దినోత్సవం నాడు గుండేరావు రాష్ట్రపతిచే సన్మానం పొందినారు. లోకసభ సభ్యుడిగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి బోథ్ వాస్తవ్యుడు. డిప్యూటి కలెక్టరుగా పనిచేసి పదవీవిరమణ చెందిన పాపిని హన్మాండ్లు ఇక్కడివారే. గ్రామంలో విఠలేశ్వర దేవాలయం ఉంది.
ఘన్‌పూర్ (Ghanpur):
ఘన్‌పూర్
ఆదిలాబాదు జిల్లా బోథ్ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారం
గ్రామ జనాభా 1100. ఇది మండలంలో మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న చివరి గ్రామం. ఈ
గ్రామ సరిహద్దు దాటగానే మహారాష్ట్రకు చెందిన నాందేడ్ జిల్లా కిన్వట్
తాలుకాలోని శింగన్‌వాడి వస్తుంది. 2019లో భాజపా తరఫున ఆదిలాబాదు ఎంపీగా ఎన్నికైన సోయం బాపురావు ఈ గ్రామానికి చెందినవారు.
గురుదేవ్ నగర్ (Gurudev nagar):
గురుదేవ్ నగర్ ఆదిలాబాదు జిల్లా బోథ్ మండలానికి చెందిన గ్రామం. గ్రామం ఏర్పాటైనప్పటి నుంచి మద్యమాంసాలకు దూరంగా ఉంది. 30 సం.ల క్రితం ఆత్రం గంగారాం అనే గిరిజనుడు ఒక గుడిసెలో ఉంటూ వ్యవసాయం చేస్తూ దేవతామూర్తుల విగ్రహాలు చెక్కుతూ ఉండేవాడు. అతని అధ్యాత్మిక చింతన నచ్చి ఒక్కొక్కరు వచ్చి నివాసం ఏర్పర్చుకున్నారు. మద్యమాంసాలకు దూరంగా ఉండేవారినే గంగారాం ఊరిలోకి అనుమతించేవాడు. భక్తుల విరాళాలతో శివాలయంతో పాటు గిరిజనుల అధ్యాత్మిక పెర్సాపెన్ ఆలయాన్ని నిర్మించారు.
కన్గుట్ట (Kangutta):
కన్గుట్ట ఆదిలాబాదు జిల్లా బోథ్ మండలమునకు చెందిన గ్రామము. ఇది జాతీయరహదారిపై ఉన్న బోథ్ క్రాస్‌రోడ్ నుంచి 8 కిమీ దూరంలో కిన్వట్ (నాందేడ్ జిల్లా) వెళ్ళు మార్గములో కలదు. కన్గుట్ట నుంచి ఆదిలాబాదు, నిర్మల్, కిన్వట్ పట్టణాలు సుమారు 50 కిమీ దూరంలో ఉన్నాయి. గ్రామ ప్రజల ప్రధానవృత్తి వ్యవసాయం. ప్రత్తి, సోయాబీన్ ఇక్కడి ప్రధానపంటలు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, జడ్పీ హైస్కూల్ ఉన్నాయి.
కౌఠ (బి) (Kouta-Buzurg):
కౌఠ (బి) ఆదిలాబాదు జిల్లా బోథ్ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3527. మండలంలో అత్యధిక జనాభా కల గ్రామాలలో మూడవది. దాదాపు 180 మంది గ్రామస్థులు ప్రభుత్వ ఉద్యోగస్థులుగా ఉన్నారు. ప్రైవేటు రంగంలో మరో 200 మంది పనిచేస్తున్నారు. గ్రామానికి చెందిన బి.రాజేందర్ ఐఏఎస్ గా ఎంపైకై కలెక్టర్ అయ్యారు.
కుచలాపూర్ (Kuchlapur)
కుచలాపూర్ ఆదిలాబాదు జిల్లా బోథ్ మండలానికి చెందిన గ్రామము. బోథ్ జడ్పీటీసిగా పనిచేసిన చిల్కూరి సంటెన్న ఈ గ్రామానికి చెందినవారు.
పొచ్చెర (Pochera):
పొచ్చెర ఆదిలాబాదు జిల్లా బోథ్ మండలమునకు చెందిన గ్రామము. పొచ్చెరకు 2 కిమీ దూరంలో పొచ్చర జలపాతం ఉంది. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2163.
సోనాల (Sonala):
సోనాల ఆదిలాబాదు జిల్లా బోథ్ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5568. మండలంలో అత్యధిక జనాభా కల గ్రామాలలో రెండవది. ఇది ఇచ్ఛోడ-కిన్వట్ మార్గంలో ఉంది. సమీపంలో చింతల్ బోరి ప్రాజెక్టు ఉంది. 2006 మే 11న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రజాపథంలో భాగంగా గ్రామాన్ని సందర్శించారు. స్వాతంత్ర్యసమరయోధుడు లక్ష్మణ్ రావు సూర్య ఈ గ్రామానికి చెందినవారు. గ్రామస్థులు చందాలు వేసుకొని రూ.15 లక్షలతో శ్రీసీతారామ ఆలయాన్ని నిర్మించుకున్నారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Boath Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి