తలమడుగు ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 19° 23' 40'' ఉత్తర అక్షాంశం మరియు 78° 23' 46'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలం గుండా రైల్వేలైన్ వెళ్ళుచుండగా, జాతీయ రహదారి మండలం తూర్పు వైపున సమీపం నుంచి వెళ్ళుచున్నది. ఈ మండలంలోని అన్ని గ్రామాలు పూర్వపు ఆదిలాబాదు తాలుకాలోనివే. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 28 గ్రామపంచాయతీలు, 28 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: తలమడుగు మండలం జిల్లాలో పశ్చిమాన మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నది. ఉత్తరాన తాంసి మండలం, తూర్పున మావల మండలం, ఆగ్నేయాన గుడిహత్నూర్ మండలం, దక్షిణాన బజార్ హత్నూర్ మండలం, పశ్చిమాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 31103. ఇందులో పురుషులు 15561, మహిళలు 15542. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 34877. ఇందులో పురుషులు 17344, మహిళలు 17533. రవాణా సౌకర్యాలు: 7వ నెంబరు జాతీయ రహదారి మండలం సమీపం నుంచి వెళ్ళుచున్నది. ముద్‌ఖేడ్ ఆదిలాబాదు రైల్వేలైన్ మండలం నుంచి వెళ్ళుచున్నది. మండలంలో 2 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
తలమడుగు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బరంపూర్ (Barampur): బరంపూర్ జిల్లా కేంద్రం నుంచి 25 కిమీ దూరంలో ఉంది. మండలంలోని పెద్ద గ్రామాలలో ఇది ఒకటి. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2560. పూర్వం గ్రామంలో తరుచుగా గొడవలు జరుగుతుండేవి. 1994లో గ్రామస్థులు హనుమాన్ మందిరాన్ని నిర్మించుకున్నారు. అలాగే వేంకటేశ్వర, పోచమ్మ, శబరిమాత ఆలయాలను నిర్మించుకున్నారు. ప్రభుత్వ సహకారంతో ఒక చెరువు కూడా నిర్మించుకున్నారు. దేవాపూర్ (Devapur): దేవాపుర్ మండలంలో మూడవ పెద్ద గ్రామము.18వ శతాబ్దిలో ఈ గ్రామానికి చెందిన రామయ్య, గోపిడి లింగయ్య, శ్రీమతి యమునలు శ్రీముని పంతులుచే పామర జనులకు అర్థమయ్యేటట్లు మహాభారతం వ్రాయించుకున్నారు. కజ్జర్ల (Kajjarla): మండలంలోని పెద్ద గ్రామాలలో ఇది ఒకటి. గ్రామస్థులు 25 లక్షలతో రామమందిరాన్ని నిర్మించుకున్నారు. పూర్వం తరుచూ గొడవలు జరిగే ఈ గ్రామంలో ప్రస్తుతం అధ్యాత్మికత నెలకొంది. కొత్తూర్ (Kothur): గ్రామంలో దుర్గామాత ఆలయం ఉంది. కుచులాపూర్ (Kuchulapur): కుచులాపూర్ మండలంలో పెద్ద గ్రామము. మద్యమాంసాలకు ఈ గ్రామం దూరంగా ఉంది. కొన్ని సం.ల క్రితం వరకు మద్యం ఏరులై పారేది. అధ్యాత్మికతే దీనికి పరిష్కారమని భావించి గ్రామంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించి మద్యం అలవాటు ఉన్నవారిచే బాబాదీక్షలు చేయించారు. సాయిలింగి (Sailingi): సాయిలింగిలో గ్రామస్థులు 17 లక్షలతో సాయిమందిరాన్ని నిర్మించుకున్నారు. పూర్వం తరుచూ గొడవలు జరిగే ఈ గ్రామంలో ప్రస్తుతం అధ్యాత్మికత నెలకొంది. సుంకిడి (Sunkidi): సుంకిడి గ్రామంలో శబరిమాత ఆలయం ఉంది. మండలంలోని పెద్ద గ్రామాలలో ఇది ఒకటి. తలమడుగు (Talamadugu): తలమడుగు ఆదిలాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. మండలంలో ఇది రెండవ పెద్ద గ్రామము. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో తొలి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం 1956లో తలమడుగులో ఏర్పడింది. ఉమ్డం (Umdam): ఉమ్డం ఆదిలాబాదు జిల్లా తలమడుగు మండలానికి చెందిన గ్రామము. గ్రామంలో రైల్వే స్టేషన్ ఉంది. .
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Talamadugu Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి